ఆస్కార్ అవార్డు గ్రహీత లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఏ ఆర్ రెహమాన్ ఆయన భార్య సైరా బాను ఇద్దరూ పెళ్లయిన చాలా సంవత్సరాల తరువాత తమ వివాహ బంధానికి ఉద్వాసన తెలిపారు. తామిద్దరూ విడిపోతున్నట్లు ఈ జంట ఒక అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది. జీవితంలో ఈ క్లిష్ట దశ నుంచి బయటికి రావడానికి వారి ప్రైవసీని గౌరవించాలని ఇద్దరూ ప్రజలని అభ్యర్థించారు.
సైరా లాయర్ వందనా షా ఒక ప్రకటన విడుదల చేస్తూ మిసెస్ సైరా ఆమె భర్త అల్లా రఖా రహమాన్ విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. వాళ్ల బంధంలో ఎంతో సంఘర్షణ తర్వాత ఈ నిర్ణయానికి వచ్చారు, వారిద్దరి మధ్య ఎంత ప్రేమ ఉన్నప్పటికీ బంధంలో వచ్చిన సమస్యలు ఉద్రిక్తతలు వారి మధ్య దూరాన్ని పెంచాయి. పెళ్లయిన చాలా సంవత్సరాల తరువాత వాళ్ళు ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నారని తెలియజేశారు. ఈ విషయంపై రెహమాన్ స్పందిస్తూ 30 ఏళ్ల సెలబ్రేషన్ వరకు వెళ్తాం అనుకున్నాం కానీ దురదృష్టవశాత్తు అది జరగలేదు.
పగిలిన గుండెలను చూసి ఆ దేవుడు కూడా కంపించిపోయి ఉంటాడు, ఈ కష్ట సమయంలో మా ప్రైవసీని గౌరవిస్తున్న అందరికీ కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చాడు. 1995లో ఈ జంటకి పెళ్లి జరిగింది కాగా వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు వారి పేర్లు ఖతిజా, రహిమా, అమీన్. ఈ సందర్భంగా ఏఆర్ రెహమాన్ త్రోబ్యాక్ ఇంటర్వ్యూ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. అందులో రెహమాన్ తన పెళ్లి, ఫ్యామిలీ లైఫ్ గురించి చెప్పిన వివరాలు వైరల్ అవుతున్నాయి. రెహమాన్ ది దక్షిణ భారతదేశ కుటుంబం కాగా ఆయన భార్య సైరాబాను ది గుజరాత్ ఫ్యామిలీ అని చెప్పుకొచ్చాడు.
కొత్తగా ఎవరితోనైనా కలిసి పోవడం ఏ కుటుంబానికైనా కష్టమే, అందరూ తల్లుల్లాగే మా అమ్మ నాపై పొసేసివ్ గా ఉండేది. ఉమ్మడిగా ఉండటం వల్ల కొంత సర్దుకుపోవాల్సి వచ్చేది అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా నేను ఇంట్లో స్టూడియోలో నా బృందంతో నిగ్రహాన్ని కోల్పోయానని చెప్పుకొచ్చాడు. తన కుటుంబం విషయానికి వస్తే తన కోపాన్ని తరచుగా ప్రదర్శించే వాడిని కూడా చెప్పుకొచ్చాడు రెహమాన్. ఇదే ఇంటర్వ్యూలో తనకి ఒంటరిగా ఉండటం అంటే ఇష్టం అనే విషయాన్ని కూడా వెల్లడించాడు రెహమాన్.