ది రాణా దగ్గుపాటి టాక్ షో తో ప్రేక్షకులను అలరించటానికి సిద్ధంగా ఉన్నాడు నటుడు రాణా. టాలీవుడ్ విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇప్పటికే రానా నాయుడు సిరీస్ తో ఓటీటీ లో మంచి విజయాన్ని అందుకున్నారు. తాజాగా హోస్ట్ గా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా నవంబర్ 23 నుంచి ది రానా దగ్గుబాటి షో అనే పేరుతో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన విశేషాలను అమెజాన్ ఓటీటీ సంస్థ తాజాగా అఫీషియల్ గా ప్రకటించింది కూడా.
అయితే ఇంతకుముందే రాణా నెంబర్ వన్ యారి అనే టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ షో కూడా మంచి ఆదరణ దక్కించుకోవడంతో ఇప్పుడు రాబోయే షోపై కూడా సినీప్రియుల లో మంచి ఆసక్తి ఏర్పడింది. అయితే ఈ టాక్ షో కి సంబంధించి రాణా పలు విషయాలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఎప్పటినుంచో అమెజాన్ ప్రైమ్ వాళ్లతో కలిసి పని చేయాలనుకున్నాను.
చాలా ఆలోచనల తర్వాత టాక్ షో చేద్దామని నిర్ణయం తీసుకున్నాము. ప్రస్తుతం టాక్ షోలు బాగా పాపులర్ అయ్యాయి. సీజన్ 1 లో 8 ఎపిసోడ్లు ఉంటాయి, ఒక్కొక్క ఎపిసోడ్ 40 నిమిషాల పైనే ఉంటుంది. షూటింగ్ దగ్గర నుంచి ఎడిటింగ్ వరకు అన్ని విషయాలను దగ్గరుండి చూసుకున్నాను అని చెప్పుకొచ్చిన రాణా ఈ షో కి ప్రభాస్, బాలకృష్ణలని ఆహ్వానించాలని ఉందని, వారితో మాట్లాడి త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని చెప్పకొచ్చాడు.
ప్రస్తుతం దుల్కర్ తో కాంత అనే సినిమా చేస్తున్నానని హిరణ్య కశ్యపకు ఇంకా సమయం పడుతుందని తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి కూడా చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఇటీవల జరిగిన అవార్డుల వేడుక సహా ఏ ఈవెంట్ కైనా అన్నీ ముందుగానే అనుకుంటాం అప్పటికి ట్రెండింగ్ లో ఉన్న వాటిని తీసుకొని ఈ జోక్స్ తయారు చేస్తాం అంటూ మొన్న జరిగిన అవార్డు ఫంక్షన్ల గురించి కూడా చెప్పుకొచ్చాడు రాణా. మరి ఈ టాక్ షో ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే!