విజయ్ టీవీలో సీరియల్ నటిగా కెరియర్ ని స్టార్ట్ చేసిన సాయి గాయత్రి తన అందంతో, నటనతో ప్రేక్షకుల దగ్గర ఎంతో అభిమానాన్ని పొందింది. సీరియల్ లో తన నటనకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎప్పుడూ పాజిటివ్ పాత్రలలోనే కనిపించాలనుకునే పట్టుదలతో ఉండేది సాయి గాయత్రి. అలా కొన్ని సీరియల్లో పాజిటివ్ గా స్టార్ట్ అయిన తన క్యారెక్టర్ ఏమాత్రమైనా షెడ్ మారుతుంది అని తెలుస్తున్నప్పుడు తను ఆ సీరియల్ నుంచి తప్పుకునేదని వార్తలు కూడా వచ్చాయి.
అలాగే “పాండియన్ స్టోర్” సీరియల్ మొదటి భాగంలో నటిస్తున్నప్పుడు సడన్గా సీరియల్ నుంచి తప్పుకొని అభిమానులకు షాక్ ఇచ్చింది సాయి గాయత్రి. దాని తర్వాత ఎంతో ప్రసిద్ధి చెందిన సీరియల్ “నీ నాన్ కాదల్” లో కూడా కొంతకాలం నటించి రెండు నెలల క్రితమే ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి అన్న కారణంతో సీరియల్ నుంచి తప్పుకుంది.
సీరియల్ లో నటించడమే కాకుండా కిందటి సంవత్సరం తల్లిదండ్రులతో కలిసి “సాయి సీక్రెట్స్” అనే ఒక బ్యూటీ ప్రొడక్ట్స్ బిజినెస్ ని ప్రారంభించింది ఈ నటి. ఇంస్టాగ్రామ్ లో ఇంకా మిగిలిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఈ బ్రాండ్ కోసం వీలైనంత వరకు ప్రమోషన్లు చేస్తుంది. తన వద్ద 20 మందికి పైగా పని చేస్తున్నారు. ఈ సాయి సీక్రెట్ సంస్థ ద్వారా హెయిర్ ప్యాక్, ఫేస్ మాస్క్, హెయిర్ ఆయిల్ తో సహా మరో 8 ఉత్పత్తులను తయారుచేసి అమ్ముతున్నారు.
ఇలాంటి పనులు చేయడానికి ప్రత్యేక యంత్రాలు ఉంటాయి. అలాంటి ఒక మెషిన్ లోనే అనుకోకుండా తన చెయ్య ఇరుక్కుపోవడంతో వెంటనే ఆసుపత్రిలో చికిత్సకు చేరింది సాయి గాయత్రి. తను ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఫోటోలు తన సోషల్ మీడియా హ్యాండిల్ లో పోస్ట్ చేస్తూ “అనుకోకుండా యంత్రాలలో చేయి పడడం వల్ల ఊహించని ప్రమాదం జరిగింది” అంటూ షేర్ చేసింది.