నయనతార పై షాకింగ్ కామెంట్స్ చేసిన నాగార్జున.. చాలా బాధనిపించిందంటున్న నయన్!

లేడీ సూపర్ స్టార్ నయనతార జీవితంపై నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నవంబర్ 18 నయనతార 40వ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. నయనతార వ్యక్తిగత జీవితం,కెరియర్ ప్రేమ పెళ్లి వంటి కీలక అంశాలని ఈ డాక్యుమెంటరీలో తెరకెక్కించారు.

ఈ డాక్యుమెంటరీ తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషలలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ డాక్యుమెంటరీలో నయనతార చాలా ఆసక్తికర విషయాలని పంచుకున్నారు. ఆమెతోపాటు ఆమెతో పనిచేసిన చాలామంది నటీనటులు ఆమె గురించి చెప్పుకొచ్చారు. అందులో మన టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా ఒకరు ఆయన నయనతార గురించి మాట్లాడుతూ నయనతార తొలిసారి సెట్ లోకి వచ్చినప్పుడు ఆమె అందంతో పాటు నడకలో కూడా రాజసం కనిపించిందన్నారు.

కొద్దిరోజులు ఆమెతో పని చేసిన తర్వాత ఆమెతో స్నేహం చేయాలనిపించిందని, ఆమె తనతో మూవీ చేస్తున్న సమయంలోనే ఆమె రిలేషన్షిప్ గురించి తెలుసుకున్నట్లు చెప్పారు నాగార్జున. నయనతార రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ఆమెలో తెలియని ఆందోళన కనిపించేదని, ఫోన్ రింగ్ అయ్యేసరికి చాలా కంగారు పడేదని, మూడ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయేదని చెప్పారు. ఆ సమయంలోనే నువ్వు ఒక ఇండిపెండెంట్ అమ్మాయివి ఇలాంటి రిలేషన్షిప్ లో ఎందుకు ఉన్నావని ఆమెను అడిగానని చెప్పకొచ్చారు. అంతేకాదు నాకు ఆమెతో తన రిలేషన్ గురించి మాట్లాడినట్లు కూడా గుర్తుంది.

నీ జీవితాన్ని ఎందుకు ఇలా చేసుకుంటున్నావు నువ్వు చాలా సాధించిన మహిళవి అని చెప్పాను అన్నారు నాగార్జున. అయితే నయనతార తన రిలేషన్ గురించి మాట్లాడుతూ రిలేషన్ అనేది ప్రేమతో కంటే నమ్మకం మీద ఎక్కువ ఏర్పడుతుంది, అవతలి వ్యక్తి మీతో ప్రేమలో ఉన్నారు అని నమ్ముతారు మీ సర్వస్వము ఇస్తారు కానీ మనుషులు చాలా విషయాలు ఊహించుకుంటారు. ప్రజలు వీటి గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నప్పుడు తనకు చాలా బాధగా అనిపిస్తుందని, ఏ అబ్బాయి తన రిలేషన్ గురించి ఇప్పటివరకు ఏం జరిగింది అని అడగలేదని చెప్పుకొచ్చింది నయనతార.