Pawan Kalyan: సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన పవన్.. ఆ బాధ్యత పూర్తిగా నాదే అంటూ?

Pawan Kalyan: ప్రస్తుత ఏపీ శాసనసభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో నేతలు అందరూ కూడా ఈ సమావేశాలలో పాల్గొన్నారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 150 సంవత్సరాలు కావడంతో ఈ 150 రోజుల పాలన గురించి కూడా శాసనసభ్యులు చర్చలు జరిగాయి తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాసనసభలో మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పై ప్రశంసల వర్షం కురిపించడమే కాకుండా ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేశారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలుగువారు కేవలం మన భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండటానికి కారణం చంద్రబాబు నాయుడని తెలిపారు. గత ప్రభుత్వం ఆయనని ఆక్రమంగా అరెస్టు చేసి జైలులో ఎంతో ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తిగా నిర్వీర్యం చేశారని పవన్ తెలిపారు.

గత ప్రభుత్వ పాలన రాష్ట్రాన్ని అన్ని రంగాలలోనూ పూర్తిగా వెనక్కి నెట్టేసిందని పవన్ తెలిపారు.కానీ భవిష్యత్తు పట్ల చంద్రబాబు ఓ నమ్మకాన్ని తీసుకొచ్చారని పేర్కొన్నారు. అందరిలోనూ నమ్మకాన్ని తెచ్చిన సీఎంకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. గత ఐదు సంవత్సరాలుగా వైకాపా చేస్తున్న అరాచకాలు దోపిడీని చూసే ప్రజల కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని తెలిపారు. ఈ 150 రోజుల పాలన చాలా సంతృప్తికరంగా ఉందని తెలిపారు రాష్ట్రం అన్ని రంగాలలోనూ అభివృద్ధివైపు అడుగులు వేస్తుందని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా వెల్లడించారు.

ఇక రాష్ట్రవ్యాప్తంగా ఏర్పడిన మంచినీటి సమస్య గురించి కూడా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా మంచినీటి సరఫరా చేసే బాధ్యత పూర్తిగా తనదేనని తెలిపారు..రక్షిత మంచి నీరు ప్రతి ఒక్కరి హక్కు అన్నారు. జలజీవన్ మిషన్‌పై ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. జలజీవన్ మిషన్ అమలులో ఏపీ దేశానికే తలమానికంగా ఉండేలా తీర్చిదిద్దుతామని ఇకపై కలుషిత నీరు అనే మాట రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ వినిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటామని పవన్ వెల్లడించారు.