ఎన్టీయార్, చరణ్ మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, అల్లు అర్జున్ మేనత్త మేనమామ పిల్లలు.. కానీ, సినిమాల పరంగా, కాదు కాదు అభిమానుల పరంగా వీరి మధ్య పెద్ద రచ్చ నడుస్తోంది. ఆస్కార్ విషయంలో రామ్ చరణ్ ఎన్టీయార్ మధ్య వైరం నడించిందని ప్రచారం జరిగింది. ‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్ మధ్య గొడవలొచ్చాయని టాక్ నడిచింది.
అయితే, టైమ్ చూసి అల్లు అర్జున్, ఎన్టీయార్ తమకు చరణ్ మీదున్న అభిమానాన్ని చాటుకున్నారు. చరణ్‌తో తమకున్న సాన్నిహిత్యాన్ని బయటపెట్టారు. చరణ్‌తో తమకు ఏదో వుందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తేల్చేశారు. అయితే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఈ విషయమై ఇన్నాళ్లూ ఫ్యాన్స్‌కి ఎలా సందేశమివ్వాలా.? అని ఈ ముగ్గురూ కూర్చుని చర్చించుకున్నారట.
తమ మధ్య ఎలాంటి వైరం లేదని ఫ్యాన్స్‌కి కన్వే చేస్తూనే ఎట్ ది సేమ్ టైమ్ ఫ్యాన్స్ హర్టవ్వకుండా జాగ్రత్త పడ్డారు. ఇంతకీ ఆ టైమ్ ఏంటంటారా.? ఇంకేముంది. మెగా పండగ. చరణ్ కుమార్తై రాక. ఈ చిన్నారి రాకనుద్దేశించి ఎంతో హార్ట్‌ఫుల్‌గా చరణ్‌కి విషెస్ తెలిపారు. దీంతో. ఈ పెద్ద సమస్య నుంచి ఈ ముగ్గురూ గట్ట్టెక్కేసినట్లే అయ్యింది.