ఈ జాతక దోషాలు పోవాలంటే చేతికి వెండి కంకణం ధరించాల్సిందే

సాధారణంగా మనం చాలామందిని చూస్తే కనుక చేతికి రాగి లేదా వెండి కంకణాలను ధరించి ఉంటారు.మరికొందరు బంగారు కంకణాలను కూడా ధరించి ఉంటారు ఎవరి ఆర్థిక స్తోమతకు తగ్గట్టుగా వారు ఇలా చేతులకు కంకణాలను ధరించడం మనం చూస్తున్నాము. చేతికి వెండి కంకణం ధరించడం ఎంతో శుభప్రదం అని పండితులు చెబుతున్నారు. వెండి కంకణం ధరించడం వల్ల జాతక దోషాలు తొలగిపోవడమే కాకుండా అన్ని శుభ ఫలితాలే కలుగుతాయని పండితులు తెలియజేస్తున్నారు.

ఇక చేతికి వెండి కంకణం ధరించడం అందరికీ మంచి ఫలితాలను ఇస్తుందని లేదు. కొందరి జాతక గ్రహాల కారణంగా ఇలా వెండి కంకణం తరించడం కొందరికి ఫలితాలు నివ్వడం మరికొందరికి సమస్యలను కూడా కలుగజేస్తుంది. చేతికి వెండి కంకణం ధరించడం వల్ల శుక్రుడు, చంద్రుడితో సంబంధం ఉన్న గ్రహ దోషాలను తొలగిస్తుంది. మీ రాశిలో ఈ దోషం ఉంటే, మీరు ఇప్పుడే ఈ వెండి కంకణం ధరించడం మంచిది. ఇక ఈ కంకణం ధరించడంతో మహాలక్ష్మి అనుగ్రహం కూడా మనపై ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు.

వెండి కంకణం ధరించడం వల్ల మనసు ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉంటుంది. మీకు కోపం ఎక్కువగా ఉంటే, మీరు ఏదైనా వెండిని ధరించవచ్చు. జ్యోతిషశాస్త్రంలో వెండిని సానుకూల శక్తిని పెంచే లోహంగా కూడా పరిగణిస్తారు.ఇక వెండి కంకణం ఎప్పుడు పడితే అప్పుడు ధరించడం మంచిది కాదు శుక్రవారం వెండి కంకణం ధరించడానికి ఎంతో అనువైన సమయం.ఇక వెండి కంకణం ధరించాలనుకునేవారు శుక్రవారం ధరించడం వల్ల మహాలక్ష్మి దేవి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది.