జాతక దోషాలు, ఇతర సమస్యలు పోవాలంటే సోమవారం శివుడిని ఈ విధంగా పూజిస్తే చాలు..?

పరమేశ్వరుడిని లోకాధిపతిగా భావిస్తారు. ఈ పరమ శివుడిని భక్తిశ్రద్ధలతో పూజించటం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా సోమవారం రోజున శివుడిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల సమస్యలు తొలగిపోయి సుఖసంతోషాలు కలుగుతాయి. ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పొందటానికి సోమవారం రోజున ప్రత్యేక పూజలు చేయాలి. జాతక దోషాలు గ్రహ దోషాలు ఇతర సమస్యలతో బాధపడేవారు శివుడిని ప్రత్యేకంగా పూజించాలి. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి చేయవలసిన పరిహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

• దృష్టి దోషాల వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి సమయంలో దృష్టి దోషాలు నివారించడానికి ఆదివారం రాత్రి పడుకునే ముందు మీ పక్కన ఒక గ్లాసు పాలను పెట్టుకుని నిద్రించండి. సోమవారం ఉదయం లేవగానే తెల్లవారుజామున తలంటు స్నానం చేసి ఈ గ్లాసులోని పాలను ఏదైనా పచ్చని మొక్కకు పోయాలి. ఇలా చేయడం వల్ల ఆ శివుని అనుగ్రహం వల్ల దృష్టి దోషాలు దూరం అవుతాయి.

• గ్రహా దోషాలు ఉన్నవారు సోమవారం రోజున దగ్గరలోని శివాలయానికి వెళ్లి ఆ శివుడిని దర్శించి పచ్చిపాలన ఆ శివుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఐదు వారాలపాటు క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న గ్రహదోషాలు తొలగిపోవడమే కాకుండా ఇతర సమస్యలు కూడా దూరమవుతాయి.

• వివాహానికి అడ్డంకులు రావడం, వివాహం ఆలస్యం అవటం, లేదా వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ప్రతి సోమవారం రోజు శివాలయానికి వెళ్లి గౌరీ శంకర రుద్రాక్ష ని శివుడికి సమర్పించాలి. ఇలా ఐదు వారాలపాటు చేయటం వల్ల సమస్యలు తొలగిపోయి వివాహం కాని వారికి వివాహం అవుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు కూడా దూరం అవుతాయి.

• ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారు ప్రతి సోమవారం ఆవు పాలలో కొన్ని నీటిని కలిపి శివునికి సమర్పించాలి. అంతేకాకుండా 108 సార్లు శివ నామస్మరణం చేయటం వల్ల కూడా ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి.

• ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్లి ఉత్తరాభిముఖంగా కూర్చుని “ఓం నమః శివాయ” అనే శివ పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. కొన్ని వారాల పాటు క్రమం తప్పకుండా ఇలా చేయటం వల్ల భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయి.