సాధారణంగా గుమ్మడికాయలు మనకి చాలా చౌకగా దొరుకుతాయి. ఈ గుమ్మడికాయలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి సాధారణ గుమ్మడికాయ, రెండు బూడిద గుమ్మడికాయ. సాధారణ గుమ్మడికాయలను ఎక్కువగా వంటలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇక బూడిద గుమ్మడికాయలను ఇంటి ముందు దిష్టి తగలకుండా వేలాడతీయటానికి ఉపయోగిస్తారు. సాధారణంగా కొత్త ఇంటిని నిర్మించుకున్నప్పుడు లేదా ఏదైనా వ్యాపారం ప్రారంభించినప్పుడు ఇంటిముందు దుకాణాల ముందు దిష్టి తగలకుండా బూడిద గుమ్మడికాయలను వేలాడదీస్తూ ఉంటారు. సాధారణంగా బూడిద గుమ్మడికాయ దాదాపు సంవత్సరం పాటు చెడిపోకుండా నిల్వ ఉంటాయి.
ఇలాంటి బూడిద గుమ్మడికాయలు ఇంటిముందు దిష్టి తగలకుండా వేలాడదీసినప్పుడు కొన్ని సందర్భాలలో కొంతకాలానికి పాడవుతూ ఉంటాయి. గుమ్మడికాయ వేలాడదీసిన కొన్ని రోజులకే పాడవడానికి గల కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం నరదిష్టి తగలకుండా ఇంటి ముందు గుమ్మడికాయలను వేలాడదీస్తూ ఉంటారు. ఇలా గుమ్మడికాయ వేలాడ తీయడం వల్ల మన ఇంటి పై పడవలసిన చెడు దృష్టిని ఆ గుమ్మడికాయ తీసుకుంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అందువల్ల ఇంటికి, దుకాణాలకు దిష్టి తగలకుండా గుమ్మడికాయ కట్టేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి.
గుమ్మడికాయలో చెట్టు నుండి కోసిన తర్వాత నేల మీద పెట్టకుండా దానిని పైన ఉంచాలి. అలాగే తెల్లవారుజాముని ఇంటిని శుభ్రం చేసుకుని ముఖద్వారాన్ని అందంగా అలంకరించుకున్న తర్వాత గుమ్మడికాయ శుభ్రంగా కడిగి దానికి పసుపు కుంకుమతో బొట్టు పెట్టి దానిని ఇంటి ముందు వేలాడదీయాలి. గుమ్మడికాయ కట్టిన తర్వాత ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత గుమ్మడికాయ కూడా ధూపం వేయాలి. ఇలా ప్రతిరోజు గుమ్మడికాయకు ధూపం చూపించడం వల్ల అది మన ఇంటిపై చెడు దృష్టి పడకుండా రక్షిస్తుంది. ముఖ్యంగా ఇంటిముందు గుమ్మడికాయ కట్టాలనుకునేవారు బుదు, గురు లేదా ఆదివారం రోజులలో గుమ్మడికాయను వేలాడ తీయడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.