దేవుడి ముందు కర్పూరం వెలిగించడానికి గల రహస్యం ఏమిటో తెలుసా..?

మన భారతీయ సంస్కృతిలో పూజా విధానానికి చాలా విశిష్టత ఉంది. ప్రజలందరూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ నిర్దిష్ట సమయాలలో పూజలను చేయటం పూర్వం నుండి ఆనవాయితీగా వస్తుంది. అందుకే మన పెద్దలు ఒక నిర్దిష్ట సమయంలో ఉదయం, సాయంత్రం దేవుడికి పూజ చేయాలని చెబుతుంటారు. ఈ సమయంలో దేవుడికి చిత్తశుద్ధితో పూజలు చేయటం వల్ల పుణ్యం లభిస్తుందని ప్రజల నమ్మకం. పూజ చేసేటప్పుడు దేవుడికి పువ్వులు సమర్పించడమే కాకుండా దేవుడి ముందు దీపం వెలిగిస్తారు. అలాగే దేవుడికి నైవేద్యంగా ప్రసాదం లేదా పండ్లు ఫలాలు సమర్పిస్తూ ఉంటారు.

అదేవిధంగా పూజ అనంతరం స్వామికి కర్పూర హారతులను కూడా ఇస్తుంటారు. పూజా సమయంలో స్వామి వారికి ఈ విధంగా పువ్వులను సమర్పించడం అంటే మనలోని ఉన్న దుర్వాసనను పువ్వుల రూపంలో స్వామివారి పాదాల చెంత ఉంచి తిరిగి వాటిని మనకు ఇస్తారు. ఈ విధంగా మనలో ఉన్న చెడు ఆలోచనలను పువ్వుల రూపంలో స్వామి వారి చెంతకు చేర్చి ఆ ఆలోచనలను తొలగిస్తాము. ఇలా స్వామివారి పాదాల చెంత ఉంచిన పువ్వులను మనం శిరస్సులో ధరించవచ్చు. ఇక పూజ ముగిసిన తర్వాత స్వామివారికి కర్పూర హారతి ఇవ్వటానికి వెనుక గల ఒక ప్రత్యేక కారణం ఉంది.

కర్పూరాన్ని పూజ చేయటానికి మాత్రమే కాకుండా ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ కర్పూరం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇక పూజ అనంతరం దేవుడికి కర్పూర హారతులను వెలిగించడం అంటే మనలో ఉన్న అహంకారాన్ని కర్పూరంలా వెలిగించి ఆ దేవుడికి సమర్పించడం. మంటలలో కాలి కర్పూరం ఎలా కరుగుతుందో ఆ కర్పూరం కరిగినట్టే మనలో ఉన్న అహంకారం కూడా కరిగిపోతుందని చెప్పడానికి పూజ సమయంలో దేవుడికి కర్పూర హారతులు ఇస్తారు. ఇలా పూజా విధానంలో మనం చేసే ప్రతి పనికి ఏదో ఒక ప్రత్యేకమైన కారణం తప్పకుండా ఉంటుంది.