దుష్ట శక్తులు దరిచేరకుండా ఉండాలంటే మీ ఇంటి ఆవరణలో ఈశాన్యం వైపు ఈ మొక్క నాటితే చాలు..?

ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తులు ఉన్నవి కూడా అంతే వాస్తవం. అందువల్ల దుష్టశక్తుల పీడ తొలగించుకోవడానికి కొంతమంది తాయత్తులు, పూజలు చేయించటం, దిష్టి తీయటం వంటివి చేస్తూ ఉంటారు. దుష్టశక్తులను తొలగించడానికి ఇలాంటి పనులు చేయటం మాత్రమే కాకుండా దుష్టశక్తులు దరిచేరకుండా ఉండటానికి కొన్ని పనులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పనులు చేయటం వల్ల దుష్ట శక్తులు దరిచేరకుండా ఉండటమే కాకుండా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి ప్రభావం కూడా తొలగిపోతుంది. మరి దుష్ట శక్తులు దరిచేరకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

దుష్టశక్తులు దరిచేరకుండా ఉండటానికి తెల్ల జిల్లేడు చెట్టు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ జిల్లేడు చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అంతేకాకుండా దీనిని పవిత్రంగా భావించి పూజలు చేస్తారు. అంతేకాకుండా దేవతా శక్తులను ఆకర్షించే గుణం ఈ తెల్ల జిల్లేడు చెట్టులో ఉంటుంది. ఈ తెల్ల జిల్లేడు చెట్టు హేరంబ గణపతికి ప్రత్యేకంగా చెప్పవచ్చు. అందువల్ల గణపతి పూజలో తెల్ల జిల్లేడు పువ్వులు ఉపయోగించడం వల్ల గణపతి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా 12 సంవత్సరాలకు పైగా నిరంతరంగా తెల్ల జిల్లేడు చెట్టు పెరిగితే దాన్ని వేర్లు గణపతి ఆకారంలో ఉంటాయి.

ఇంతటి పరమ పవిత్రమైన ఈ తెల్ల జిల్లేడు చెట్టును ఇంట్లో పెంచుతూ పూజిస్తారు. తెల్ల జిల్లేడు చెట్టు ఇంట్లో పెంచి పూజించటం వల్ల దుష్టశక్తులు మీ ఇంటికి దరిదాపుల్లో కూడా ఉండవు. ఈ తెల్ల జిల్లేడు చెట్టు ఈసారి దిశలో పెంచి పూజించటం వల్ల ప్రతికూల శక్తిని తొలగించి మీ ఇంటి మీద దుష్టశక్తుల దృష్టి పడకుండా నివారిస్తుంది. అంతేకాకుండా తెల్ల జిల్లేడు చెట్టు ఇంట్లో పెంచడం వల్ల ఇంటికి పట్టిన దరిద్రం కూడా తొలగిపోతుంది. జిల్లేడు చెట్టు సిరి సంపదలకు చిహ్నంగా భావిస్తారు. ఈ మొక్క ని ఇంట్లో ఉంచి పూజిస్తే ధన ధాన్యాలకు లోటు ఉండదు.