ఈ పరిహారాలు పాటిస్తే ఇంట్లో దుష్ట శక్తి ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది..?

సాధారణంగా కొన్ని ఇళ్లల్లో దుష్టశక్తులు ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం వల్ల ఇంట్లో నివసించే ప్రజలు నిరంతరం భయపడుతూ ఉంటారు. అంతేకాకుండా నిద్రలో పీడకలలు రావడం, కొన్ని సందర్భాలలో భయంతో ఉలిక్కిపడి లేవడం, పగటిపూట కూడా వింత శబ్దాలు వినిపించటం వంటివి జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా దుష్టశక్తుల ప్రభావం ఉన్న ఇంట్లో కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యలతో కుటుంబ సభ్యులు బాధపడుతూ ఉన్నట్లయితే కొన్ని చిట్కాలను పాటించటం వల్ల ఇంట్లో ఉన్న దుష్టశక్తి ప్రభావం పూర్తిగా తొలగిపోయి సమస్యలు దూరం అవుతాయి. ఇంట్లో ఉన్న దుష్టశక్తి ప్రభావాన్ని తొలగించడానికి ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

• ఇంట్లో తరచూ ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే పండితుల చేత ఇంట్లో శాంతి పూజలు, హోమాలు జరిపించాలి. అంతేకాకుండా ప్రతిరోజు ఇంట్లో ధూపం వేయటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుంది.
• అలాగే జీలకర్ర ఉప్పు సమపాలల్లో తీసుకుని ఇంట్లో ఉన్న ధారాల వద్ద కిటికీల వద్ద చల్లడం వల్ల దుష్టశక్తి ప్రభావం తొలగిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు.
• ఇంటి ప్రధాన ద్వారం మీద పవిత్రమైన పసుపుతో స్వస్తిక్ ,ఓం గుర్తులు రాయటం వల్ల కూడా ఈ ప్రభావం తొలగిపోతుంది.
• పరమ పవిత్రమైన తులసి ఆకులను కోసి వాటి నుండి రసం తీసి ఒక రాగి కలశంలో నీటిని కొన్ని నీళ్లు తీసుకోవాలి. ఆ తర్వాత ఈ తులసి ఆకుల రసాన్ని ఆ రాగి కలశంలో కలిపి ఇళ్లు మొత్తం చల్లాలి . ఇలా చేయడం వల్ల దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోతుందని పండితులు సూచిస్తున్నారు.
• అలాగే ఇంట్లో ఎల్లప్పుడూ హనుమంతుడిని పూజించటం వల్ల కూడా ఇలాంటి శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు.