సాధారణంగా ఎక్కడ చూసినా దళితుల పట్ల వివక్ష ఎక్కువగానే ఉంటుంది. దళితులను చిన్నచూపు చూస్తూ వారిని శుభకార్యాలకు ఆహ్వానించటమే కాకుండా అగ్రకులాల వారు తమ ఇంటిలోనికి దేవాలయాలలోనికి కూడా దళితులకు ప్రవేశాన్ని నిషేధించారు. పురాతన కాలంలో ఇలా దళితుల పట్ల చాలా వివక్ష చూపేవారు. కానీ ప్రస్తుత కాలంలో సాంకేతికంగా దేశం ఎంత అభివృద్ధి చెందినా కూడా అక్కడక్కడ ఇలా దళితుల పట్ల వివక్ష చూపుతున్నారు. ఇప్పటికీ చాలా ప్రదేశాలలో దేవాలయాలలోకి దళితులకు ప్రవేశం నిషేధించబడింది. అయితే తాము కూడా అందరిలాంటి మనుషులమేనని దేవుడిని దర్శించుకొని కోరిక తమకి ఉంటుందని దళితులు మన పెట్టుకున్న కూడా అగ్రకులాల వారు మాత్రం దేవాలయాలలోనికి ప్రవేశించడానికి వారిని అడ్డుకుంటున్నారు.
అయితే ఇటీవల 200 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతన దేవాలయంలోకి మొట్టమొదటిసారిగా దళితులు ఆలయంలోకి ప్రవేశించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా దేశంలో ఉన్న అనేక దేవాలయాలలో పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు తమిళనాడు రాష్ట్రంలోని కళ్ళకురిచ్చీ జిల్లా చిన్న సేలం నగరంలో ఉన్న 200 సంవత్సరాల నాటి వరదరాజా పెరుమాళ్ దేవాలయంలో కి మొట్టమొదటిసారిగా దళిత వర్గాలకు చెందిన ప్రజలను ఆలయంలోకి వెళ్లి దేవుడిని దర్శించుకునే అవకాశం కల్పించారు. దాదాపు రెండు వందల సంవత్సరాల నుంచి పెరుమాళ్ దేవాలయంలోకి దళిత వర్గాలకు చెందిన ప్రజలకు ప్రవేశం నిషేధించారు.
దళితులకు అగ్రవర్ణాలతో పాటు సామాన న్యాయం కల్పిస్తూ ఆలయంలోకి ప్రవేశించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కొన్ని సంవత్సరాలుగా అనేక నిరసనలు చేశారు. దాదాపు రెండు వందల సంవత్సరాల తర్వాత దళితులు ఈ ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది . ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ శ్రవణ్ కుమార్ తో పాటు మరో అధికారి హిందూ మతా మరియు ధర్మాదాయ శాఖ నుంచి ఆదేశాలు అందుకొని షెడ్యూలు కులాలను దేవాలయంలోకి అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ముక్కోటి ఏకాదశి సందర్భంగా దళిత వర్కులాలకు చెందిన ప్రజలందరూ కూడా ఆలయంలోకి ప్రవేశించి దేవుడి దర్శనం చేసుకున్నారు.