భర్త కొట్టాడన్న కోపంతో ఆ భార్య చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ప్రస్థుత కాలంలో క్రైమ్ రేటు బాగా పెరిగిపోతోంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకు గొడవలు జరిగే నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా తమిళనాడులో కూడా ఇటువంటి దారుణ సంఘటన చోటు చేసుకుంది. భర్త మద్యం సేవించి వేధిస్తున్నాడన్న కారణంతో భార్య భర్తని దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది.

వివరాలలోకి వెళితే … తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లాలోని తిరువెరుంపూర్ లో 27 సంవత్సరాల వయసు గల సెల్వరాజ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతనికి డయానా మేరీ అనే యువతితో వివాహం జరిగింది. సెల్వరాజ్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. అయితే ఇతను రోజు మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్య ను కొట్టేవాడు. అంతే కాకుండా తరచూ ఆమెతో గొడవపడి దాడి చేసేవాడు. ఈ నేపథ్యంలో భర్త ప్రవర్తనతో విసుగు చెందిన భార్య… మూడు నెలల క్రితం అదే ఊరిలో నివాసముంటున్న తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళింది. ఊరి పెద్దలు బంధువులు ఎన్ని చెప్పినా డయానా మేరీ వినిపించుకోకుండా సెల్వరాజ్ తో కాపురానికి ససేమీరా చెప్పింది.

ఈ మేరకు మే 5వ తారీఖున సెల్వరాజ్మద్యం సేవించి డయానా మేరీ ఉన్న ఇంటి వద్దకు వెళ్లాడు. ఆమెను కాపురానికి రావలసినదిగా కోరాడు, అయితే ఆమె కాపురానికి రావడానికి నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన సెల్వరాజ్ భార్యని కొట్టాడు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన డయానా మేరీ అప్పటికే స్టవ్ మీద కాలుతున్న నీటిలో కారంపొడి వేసి సెల్వరాజ్ మీదకు చల్లింది. దీంతో తీవ్ర గాయాలైన సెల్వరాజ్ ని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సెల్వరాజ్ శుక్రవారం ఉదయం కన్నుమూశాడు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సెల్వరాజ్ మృతికి కారణమైన మేరీ మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.