‘మహర్షి’వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ (ఏరియావైజ్)

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ‘మహర్షి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టి వార్తల్లోకి ఎక్కిన ఈ చిత్రం ‘ఎఫ్ 2’ మూవీ లైఫ్ టైమ్ కలెక్షన్ రికార్డును అధిగమించి 2019లో హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన మూవీగా నిలిచింది. టాక్ డివైడ్ గా ఉన్న కలెక్షన్స్ లో మాత్రం కుమ్మేసేంది. మార్కెట్ వేరే పెద్ద హీరోల సినిమాలు ఏమీ లేకపోవటంతో ఏర్పడిన వ్యాక్యూమ్ తో ఈ సినిమా బాగా బెనిఫిట్ పొందింది. మహేష్ కెరీర్ లో తొలి వందకోట్ల షేర్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం కలెక్షన్స్ షేర్ ఏరియావైజ్ చూద్దాం.

ఏరియా షేర్

నైజాం 29.9 కోట్లు

సీడెడ్ 10.10 కోట్లు
ఉత్తరాంధ్ర 10.9 కోట్లు
ఈస్ట్ గోదావరి 7.18 కోట్లు
వెస్ట్ గోదావరి 6.05 కోట్లు
కృష్ణా 5.8 కోట్లు
గుంటూరు 7.8 కోట్లు
నెల్లూరు 2.78 కోట్లు
ఆంధ్రా + నైజాం 80.51 కోట్లు
భారత్ లో మిగిలిన ప్రాంతాలు 10.7 కోట్లు
ఓవర్ సీస్ 10.4 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కలెక్ష న్స్ 101.61 కోట్లు

ఇక ఈ చిత్రం జూలై 3 న అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతోంది. మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా తమ అభిమాన చిత్రాన్ని మరోసారి స్మాల్ స్క్రీన్ పై చూడాలని ఉత్సాహం చూపిస్తున్నారు.

దిల్ రాజు, పీవీపీ, అశ్వనీదత్ నిర్మాణంలో భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించగా హీరోయిన్ గా పూజా హెగ్దే తన అందాలను ఆరబోసింది. జగపతిబాబు విలన్‌గా మరోసారి అదరకొట్టారు. తన కామెడీతో ఎప్పుడు ప్రేక్షకులను నవ్వించే అల్లరి నరేష్ ఈ చిత్రంలో సీరియస్ క్యారెక్టర్ చేసి ఆకట్టుకున్నారు.