సినిమా జీవితాన్ని అనుకరిస్తుందో లేదో కానీ గే పాత్రలో కనపడ్డ ఈ హీరో ని మాత్రం అబ్బాయిలు అనుసరిస్తున్నారు. వెంటపడి,, పెళ్లి చేసుకుందాం అంటూ ప్రపోజల్స్ పెడుతున్నారు. మెసేజ్ లతో మెంటలెక్కిస్తున్నారు. ఏం చేయాలో అర్దం కానీ సిట్యువేషన్ లో పడి నేను గేను కాదు బాబోయ్..నన్ను వదలండి అని రిక్వెస్ట్ లు ఆక్రందనలు చేస్తున్నారు. ఇంతకీ ఎవరా హీరో .. అంటే అర్జున్ మాథూర్.
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జీవిత నేపథ్యంతో తెరకెక్కిన మూవీ ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’. ఈ సినిమాలో మన్మోహన్ సింగ్ పాత్రలో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ నటించగా.. రాహుల్ గాంధీగా అర్జున్ మాథూర్ నటించారు. రాహుల్ పాత్రలో అలరించిన అర్జున్ నటనకు ప్రశంసలుతో పాటు మంచి గుర్తింపు లభించింది.
అయితే ఆ సినిమా తర్వాత అర్జున్ ‘ మేడ్ ఇన్ హెవెన్’ అనే వెబ్ సిరీస్‌లో నటించాడు. ఇందులో ఆయన ఓ స్వలింగ సంపర్కుడి పాత్రను పోషించాడు. ఆ పాత్రతో ఇప్పుడు గేలు అంతా ఆయనకు మెసేజ్‌లు చేయడం ప్రారంభించారు.
ఎందుకిలా అంటే అర్జున్ మాథూర్ కూడా తమలా ఓ ‘గే’ అనుకొని చాలామంది అబ్బాయిల కూడా ఆయనకు మెసేజ్‌లు పెడుతున్నారు. వీటితో అర్జున్ చాలా కలత చెందుతున్నాడు. మరి కొందరైతే.. చాలా అసభ్యకర మెసేజ్‌లు చేస్తున్నారని , తనను తనను పెళ్లి చేసుకోవాలని కొందరు కుర్రాళ్లు అడుగుతున్నారని అర్జున్ వాపోయాడు.అప్పటికీ తాను అటువంటి వాడిని కాదని చెప్పినా వినడం లేదని అర్జున్ అంటున్నారు.
అయితే కొందరు మాత్రం గే గా తన నటనను ప్రశంసిస్తూ, ఈ సిరీస్ విడుదలైన తరువాత తమలో ఆత్మవిశ్వాసం పెరిగిందని అంటున్న వారు కూడా ఉన్నారని చెప్పుకొచ్చాడు. తాను తెరపై నటించే పాత్రలను, తన నిజ జీవితాన్ని కలిపి చూడవద్దని అర్జున్ నెటిజన్లను, తన అభిమానుల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు.