బయటపడిన టిడిపి బలహీనత..ఆందోళనలో నేతలు

చంద్రబాడునాయుడు బండారం బయటపడింది. రాబోయే ఎన్నికల్లో తన పార్టనర్ విషయాన్ని స్వయంగా చంద్రబాబే బయటపెట్టారు. అనాలోచితంగా వచ్చేసిందో లేకపోతే వ్యూహాత్మకంగానే బయటపెట్టారో తెలీదు. వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలిసి పోటీచేస్తే జగన్ కేంటి బాధ ? అంటూ ప్రశ్నించారు. అంటే పవన్ తో కలిసి పోటీ చేయాలన్న ఆలోచన లేందే చంద్రబాబు నోటమ్మట ఆ మాట రాదన్న విషయం అందరికీ తెలిసిందే. వచ్చిందంటే అంతర్లీనంగా చంద్రబాబు, పవన్ మధ్య కొనసాగుతున్న బంధం బయటపడినట్లైంది. తెలంగాణాలో దెబ్బకు కాంగ్రెస్ తో ఏపిలో పొత్తుంటుందో లేదో ఇంకా స్పష్టం కాలేదు. ఆ దశలో ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేదు. అందుకనే మళ్ళీ పవన్ ను దగ్గరకు తీసుకునే ప్రయత్నాలు మొదలైనట్లు తెలుస్తోంది.

 

విచిత్రమేమిటంటే, బిజెపితో కాంగ్రెస్ తో తాను పొత్తులు పెట్టుకుంటు అదే సమయంలో జగన్ ను దెప్పి పొడుస్తున్నారు. 2014 ఎన్నికల్లో వైసిపికి ఓట్లేస్తే కాంగ్రెస్ కు ఓటేసినట్లే అన్నారు. తర్వాత బిజెపిని వదిలేసి అదే కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకున్నారు. ఇఫుడేమో వైసిపికి ఓట్లేస్తే బిజెపికి ఓట్లేసినట్లే అని అంటున్నారు. అదే సమయంలో నరేంద్రమోడి, జగన్, పవన్ ఒకటే అని ఒకసారంటారు. మరో సమయంలో నరేంద్రమోడి, జగన్, కెసియార్ ఒకటే అని అంటున్నారు. అంటే జగన్ ను ఎలా గబ్బు పట్టించాలని చంద్రబాబు అనుకుంటే అలా బురద చల్లుతున్నారు. ఎలాగూ భుజాన మోసే మీడియా ఉంది కాబట్టి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.

 

చంద్రబాబు తాజా వ్యాఖ్యలతో తెలుగుదేశంపార్టీ బలహీనతే బయటపడింది. ఏదో ఓ పార్టీతో పొత్తు పెట్టుకోనిదే చంద్రబాబు ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళలేరు అన్న విషయం మరోసారి స్పష్టమైంది. అదే సమయంలో కాపుల ఓట్ల కోసం పవన్ తప్ప తనకు వేరే దారిలేదని కూడా చంద్రబాబు ఒప్పుకున్నట్లైంది. అందుకనే పవన్ ను మంచి చేసుకునేందుకు పవన్ కు సానుకూలంగా మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ , పవన్ కలిసి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అదే జరిగితే నిజంగా చంద్రబాబుకు చాలా ఇబ్బంది. కాబట్టి జగన్, పవన్ కలవకుండా చంద్రబాబు చాలా ప్లాన్డ్ గా పవన్ గురించి మాట్లాడుతున్నారు.

 

దానికితోడు పవన్ వైఖరి కూడా అనుమానాలకు దారితీస్తోంది. అధికారంలో ఉన్న చంద్రబాబును కాకుండా ప్రతిపక్షంలో ఉన్న జగన్నే టార్గెట్ గా పెట్టుకోవటంతోనే పవన్ ఆలోచనేంటో అర్ధమైపోతోంది. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా అధికార పార్టీపై ప్రతిపక్షాలు పోరాటం చేస్తాయి. కానీ ఏపిలో మాత్రం విచిత్రంగా జగన్ ను పవన్ టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇక్కడే పవన్ వైఖరిపై అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈ సమయంలోనే చంద్రబాబు చేసిన తాజా వ్యాఖ్యలతో చంద్రబాబు, పవన్ ఒకటే అన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి.