రాహుల్ తీరుపై స్పీకర్ ఫైర్, కన్ను కొట్టుడేంది, కౌగిలించుకునుడేంది

పార్లమెంటులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరుపట్ల స్పీకర్ సుమిత్రా మహజన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో సభ్యులంతా హుందాతనంగా వ్యవహరించాలని అన్నారు. మనుషుల మీద అభిమానం ఉండాలి కానీ హోదాకు విలువ ఇవ్వాలని సూచించారు. సభలో ఆయన నరేంద్ర మోదీ కాదు. దేశ ప్రధాని అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. సభలో మోదీని రాహుల్ కౌగిలించుకొని వెళ్లిన తర్వాత కన్నుకొట్టారు. అది సరైనది కాదు. రాహుల్ చేసిన పని సరైనది కాదన్నారు. ఒకరిని ఇంకొకరు  కౌగిలించుకోవడాన్ని  నేను ఆపలేను కానీ సభకు ఓ మర్యాద ఉంటుంది దానిని అందరూ  పాటించాలన్నారు. రాహుల్ అంటే తనకు ఎటువంటి ద్వేషం లేదన్నారు. రాహుల్ ప్రసంగం ముగిసిన తర్వాత ప్రధానిని కౌగిలించుకోవడం అంటే సభను తప్పుదోవపట్టించడమని బిజెపి నేతలు ఆరోపించారు. రాహుల్ పై సభాహక్కుల ఉల్లంఘన చర్యలు తీసుకోవాలన్నారు. అయితే రాహుల్ ప్రధానమంత్రి దగ్గరకు వెళుతున్నప్పుడు నవ్వుతూ   కనిపించిన స్పీకర్ ఆ తర్వాత అది సరైన పద్దతి కాదనటం గమనించాల్సిన విషయమని ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు అన్నారు.