AP: మాజీ ముఖ్యమంత్రి జగన్ కి ప్రతిపక్ష నేత హోదా…. క్లారిటీ ఇచ్చిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు!

AP : 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా వైఎస్ఆర్సిపి పార్టీ ఘోర ఓటమి పాలైన సంగతి మనకు తెలిసిందే. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో చివరికి ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లడానికి కూడా అర్హుడు కాదనే చెప్పాలి. ఇక ఈయన కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే అసెంబ్లీకి వెళ్లి రావాల్సి ఉంటుంది అయితే జగన్ మాత్రం తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెబుతున్నారు.

ప్రతిపక్ష నేతక హోదా ఉన్నప్పుడే ప్రజల సమస్యలను ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంటుంది అందుకే తనకు ప్రతిపక్ష నేతగా హోదా ఇవ్వాలంటూ జగన్ డిమాండ్ చేశారు అయితే జగన్ డిమాండ్ గురించి స్పీకర్ అయ్యన్నపాత్రులు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసిన అనంతరం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం సాధ్యం కాదని తేల్చేశారు. ప్రతిపక్ష నేతగా హోదా ఇవ్వాలి అంటే కనీసం 18 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉండాలని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పార్టీకి అంత మంది బలం లేదు కనుక ఆయనకు ప్రతిపక్ష నేతగా హోదా ఇవ్వడం జరగదని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా కాకుండా ఒక సాధారణ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చి తమ నియోజకవర్గ సమస్యలను చెప్పవచ్చని తెలిపారు.

అసెంబ్లీ నియమాలు, నిబంధనలను జగన్‌ తెలుసుకోవాలని సూచించారు. స్పీకర్ గా నాకు కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి. తన ఇష్టానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం కుదరదని కూడా తెలిపారు. అనుమతి లేకుండా 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే చర్యలు తీసుకోవచ్చు. ఫలానా కారణం వల్ల సభకు రాలేకపోతున్నానని స్పీకర్ కు లేఖ ఇవ్వాల్సి ఉంటుంది. సభకు రాని సభ్యులు వ్యక్తిగతంగా లేఖలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఇక ఈయన మాటలను బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఐదు సంవత్సరాలు కాలంలో ప్రతిపక్ష నేతగా హోదా ఉండదని స్పష్టమవుతుంది.