మర మనిషిగా స్పీకర్.! నిజమే.. తప్పేముందిట.?

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ విషయమై తెలంగాణ బీజేపీ నేత.. ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ‘మర మనిషి’ అంటూ విమర్శలు చేయడం రాజకీయంగా పెను దుమారం రేపుతోన్న విషయం విదితమే. స్పీకర్ విషయంలో ఇలాంటి వెటకారాలు సబబు కాదు.! కానీ, ఎప్పుడు.? స్పీకర్ స్థానంలో కూర్చున్న వ్యక్తి.. రాజకీయాలు మాట్లాడనప్పుడు, రాజకీయాలు చేయనప్పుడు మాత్రమే.!

స్పీకర్ పదవి అంటే, ప్రత్యక్ష రాజకీయాల నుంచి తాత్కాలిక విరామం.. అన్న భావన వుండడం సహజమే. ఎందుకంటే, స్పీకర్ రాజకీయ విమర్శలు చేయకూడదు. స్పీకర్ రాజకీయాల గురించి మాట్లాడకూడదు. అధికార పార్టీకి చెందిన వ్యక్తి స్పీకర్ పదవిలో వుంటారుగానీ, అధికార పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకోకూడదు. ఇవన్నీ నైతికత కోణంలో ఆలోచించినప్పుడు మాత్రమే.

అసలు రాజకీయాల్లో నైతికతకు స్థానం ఎక్కడిది.? స్పీకర్ అంటే, అధికార పార్టీ నాయకుడే ఇప్పుడు. ఆ మాటకొస్తే, సగటు అధికార పార్టీ నాయకుడికంటే జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు స్పీకర్ స్థానంలో వుంటోన్న వ్యక్తులు. ఓ రాష్ట్రానికి పరిమితమైన అంశం కాదిది. దేశవ్యాప్తంగా నడుస్తున్న వ్యవహారమే.

సో, స్పీకర్‌ని మర మనిషిగా అభివర్ణించకూడదు. ఎందుకంటే, మరమనిషికి విజ్ఞత వుండదు. ఇక్కడ స్పీకర్‌కి విజ్ఞత వుంది. అధికార పార్టీ ఎలా చెబితే అలా నడచుకోవాలన్న విజ్ఞతతో స్పీకర్లు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రాల చట్ట సభల నుంచి, లోక్ సభ అలాగే రాజ్యసభ విషయంలోనూ అదే జరుగుతోంది.

పార్టీ ఫిరాయింపుల విషయంలో అధికార పార్టీ ఎలా చెబితే, అలా స్పీకర్ నడుచుకోవడం కొత్తేమీ కాదు. టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యులైనవారు, బీజేపీలో చేరినప్పుడు..

వారిని వారించే క్రమంలో.! ఉప రాష్ట్రపతిగా.. అదే సమయంలో రాజ్యసభ ఛైర్మన్‌గా పని చేసిన వెంకయ్యనాయుడికే ఇబ్బంది తప్పలేదు.. బీజేపీ చెప్పినట్లు నడుచుకోవాల్సి వచ్చింది.