విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను చేస్తోంది. ఈ ప్రైవేటీకరణను అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు అన్నట్టు ఉంది పరిస్థితి. రాజకీయ పార్టీలేమో బీజేపీని నిలదీస్తాం, అవసరమైతే రాజీనామాలకు కూడ వెనుకాడమని అంటున్నారు. టీడీపీ నేరుగా మోడీని విమర్శించకుండా వైసీపీ మీద నిప్పులు చెరుగుతోంది. వైసీపీ ఏమో నామమాత్రంగానే కేంద్రానికి లేఖలు, వినతులు పంపుతోంది. ఎక్కడా నిఖార్సైన పోరాటం లేదు. ఇక ప్రజల పక్షం నిలబడి పోరాడటం అన్న జనసేన మీద కూడ స్టీల్ ప్లాంట్ విషయంలో జనం ఆసక్తి చూపారు. ఇలాంటి ప్రైవేటీకరణ పద్దతులను పవన్ అస్సలు సహించారు. సంపద ప్రభుత్వ ఆదేహీనాంలోనే ఉంటే ప్రజలకు ప్రయోజనాలు అందుతాయనే ఉద్దేశ్యం అయనది.
కానీ ఆయన బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఆయన బీజేపీ మీద ఎలా రియాక్ట్ అవుతారో అనుకున్నారు. పవన్ కూడ ప్రైవేటీకరణ వద్దని అంటూ కేంద్ర పెద్దలతో మాట్లాడతానని ఢిల్లీ వెళ్లారు. అమిత్ షాతో చర్చలు జరిపారు. చర్చల అనంతరం ఈ ప్రైవేటీకరణ ఇప్పటికిప్పుడు జరుగుతున్నది కాదని, కొన్ని సంత్సరాలుగా ఆర్ధిక సంస్కరణల్లో భాగంగా జరుగుతున్నది చెప్పుకొచ్చారు. అయినా ఇప్పుడు ప్రత్యేక పరిస్థితులున్నాయి కాబట్టి మరోసారి ఈ విషయాన్ని పునరాలోచించాలని కోరినట్టు చెప్పారు. మరోసారి అమిత్ షాతో చర్చలు జరుపుతామని అన్నారు. పనిలో పనిగా వైసీపీ మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆపవచ్చు లేదంటే లేదు అంటూ భారం మొత్తం వైసీపీ మీదనే వేసేశారు.
జనసేన స్టేట్మెంట్లు చూస్తే ప్రైవేటీకరణను తాము అడ్డుకోలేమని చెప్పకనే చెప్పేసింది. కానీ ఆ ప్రైవేటీకరణ అన్యాయమని, ఆంధ్రుల ఆత్మగౌరవానికి, హక్కులకు అవమానమని బీజేపీని నిలదీయట్లేదు. ప్రజలను అనుగుణమైన తమ అభీష్టాన్ని కాదంటున్నందుకు వారితో దోస్తీని కట్ చేసుకుంటామని అనట్లేదు. పైగా వచ్చే ఎన్నికల వరకు జనసేన – బీజేపీల కూటమి ఎలా ముందుకువెళ్లాలో రూట్ మ్యాప్ వేసుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. అంటే వీరి స్నేహం విడిపోయే ప్రసక్తే లేదు. అలాంటి ప్రసక్తే లేనప్పుడు స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం అనే టాపిక్ కూడ లేనట్టే కదా. విశాఖలో జనసేనకు కొంత ఆదరణ ఉంది. ఈ యూటర్న్ రాజకీయామతో అది కూడ ఎగిరిపోవచ్చు.