ఏపీలో మత రాజకీయంతో బలపడేందుకే బీజేపీ పార్టీ ఇంత హడావిడి చేస్తుందా?

Is the BJP in such a hurry to strengthen itself with religious politics in the AP?

రాష్ట్రంలో జరుగుతున్న సంఘవిద్రోహచర్యలు ప్రజలను ఎంతో కలవరపాటుకు గురి చేస్తున్నాయి. తాజాగా విజయ నగరం జిల్లా రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం మీద జరిగిన దాడి, విజయవాడలో సీతా దేవి విగ్రహం మీద జరిగిన దాడులు ఇప్పుడు రాజకీయంగా వేడిని రాజేశాయి. దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు మొదలుపెట్టగా ప్రతిపక్షాలు దీన్ని రాజకీయం చేసి తమకు లభ్దీ చేకూరే విధంగా పావులు కదుపుతుంది. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న రామతీర్థం ఘటన ని ప్రతిపక్షాలు తమ రాజకీయ ఎదుగుదలకి వాడుకోవాలయం చూస్తుంది. ఇప్పటికే చంద్రబాబు విజయనగరం జిల్లాకు చేరుకొని జగన్ ని ఎంత అనాలో అంత అనేశారు.

Is the BJP in such a hurry to strengthen itself with religious politics in the AP?
Is the BJP in such a hurry to strengthen itself with religious politics in the AP?

మరోవైపు బీజేపీ, జనసేన తిరుపతి ఎన్నికల నేపథ్యంలో రామతీర్థాన్ని వాడుకుని రాజకీయంగా లభ్దీ పొందాలని చూస్తుండగా ఇప్పటి వరకు రాష్ట్రాన్ని గాలికొదిలేసి పక్కరాష్ట్రంలో ఉంటున్న చంద్రబాబు కూడా పొలోమంటూ రాముడి చెంత వాలిపోయాడు. బీజేపీ జనసేన ద్వయం అయితే ఈ ఘటన కు వైసీపీ నే కారణమని చెప్తుంది.. జగన్ ను విమర్శించడానికి ఎప్పుడెప్పుడు ఛాన్స్ వస్తుందా అని చూస్తున వీరికి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లయింది.. ఇక బీజేపీ అయితే దీన్ని పెద్ద ఎత్తున వాడుకోవాలని చూస్తుంది. మతాల చిచ్చును రాజకీయంగా వాడుకోవడంలో.. బీజేపీ ఎంతకైనా దిగజారిపోతుందని… సునీల్ ధియోధర్, బండి సంజయ్ ప్రకటనతో తేలిపోయిందన్న విమర్శలు వస్తున్నాయి.

అసలు రామతీర్థం ఆలయంలో జరిగినదానికి.. రాజకీయానికి ఏమైనా సంబంధం ఉందా..? అసలు బీజేపీకి ఏమైనా సంబంధం ఉందా..? అసలు ఏసు ప్రభువుకి.. కృష్ణుడికి ఏమైనా సంబంధం ఉందా..? బైబిల్, భగవద్గీత పోలిక ఎందుకు..? అయినా బీజేపీ నేతలు లింక్ పెట్టేశారు. ప్రజల్ని రెచ్చగొట్టి.. వారి మధ్య… విభజన రేఖ గీసి.. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి బేహారుల్లా తయారై వచ్చేశారు. దేశం మొత్తం ముస్లింలను బూచిగా చూపే… బీజేపీ.. ఏపీలో మాత్రం.. క్రైస్తవాన్ని చూపించడం ప్రారంభించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రైస్తవాన్ని ఆచరిస్తాడు కాబట్టి.. దాన్ని టార్గెట్ చేసి.. అందర్నీ ఆయనకు వ్యతిరేకంగా తమ వైపు తిప్పుకోవాలనే ప్లాన్ అమలు చేస్తున్నారు.