ఘట్టమనేనికి పదవి ఫైనల్..చంద్రబాబును నమ్మొచ్చా ?

వైసిపిలో నుండి తెలుగుదేశంపార్టీలోకి చేరబోతున్న ఘట్టమనేని ఆది శేషగిరిరావుకు అప్పుడు ఓ పదవి ఫైనల్ అయ్యిందట. వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రాగానే ఆదిశేషగిరిరావుకు పదవి ఖాయమని చంద్రబాబు హామీ ఇచ్చారని సమాచారం.  ఘట్టమనేని మొన్నటి వరకూ వైసిపి రాజకీయ వ్యవహారాల కమిటిలో సభ్యునిగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. జగన్ కున్న సన్నిహితుల్లో ఆది శేషగిరిరావు కూడా ఒకరనే చెప్పాలి. అలాంటి ఘట్టమనేని నాలుగు రోజుల క్రితమే వైసిపికి రాజీనామా చేశారు. సరిగ్గా ఎన్నికలకు ముందే ఆది శేషగిరిరావు ఎందుకు వైసిపికి రాజీనామా చేశారు ? ఇంకెందుకు తెర వెనుక నుండి కథ నడిపించిందంతా చంద్రబాబునాయుడే.

ఎగస్ పార్టీ నేతలను గోకడంలో చంద్రబాబు బాగా ఎక్స్ పర్టన్న విషయం ఇఫ్పటికే చాలాసార్లు బయటపడింది. వైసిపి తరపున గెలిచిన 22 మంది ఎంఎల్ఏలను, ముగ్గురు ఎంపిలను బాగా గోకి టిడిపిలోకి లాక్కున్నపుడే తెలిసింది చంద్రబాబు గోకుడు యవ్వారం. తాజాగా చంద్రబాబు గోకుడుకు ఆది శేషగిరిరావు కూడా బలైపోయారు. రేపటి ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ అధికారంలోకి రాగానే ఎంఎల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని టిడిపి వర్గాలు చెప్పాయి. ఇక్కడ పాయింట్ ఏమిటంటే టిడిపి అధికారంలోకి వస్తే.

ఇక్కడే అందరికీ అనేక అనుమానాలు మొదలయ్యాయి. వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవనే ప్రచారం బాగా జరుగుతోంది. జగనే కాబోయే ముఖ్యమంత్రిగా జరుగుతున్న ప్రచారం కూడా అందరూ చూస్తున్నదే. ఇటువంటి సమయంలో ఆది శేషగరిరావు వైసిపిని వదిలిపెట్టి టిడిపిలో చేరటమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చంద్రబాబు హామీలను నమ్మేంత అమాయకుడు కాదు ఆది శేషగిరిరావు.

మొన్నటికి మొన్న తెలంగాణా ఎన్నికల్లో కుకట్ పల్లి నియోజకవర్గంలో పోటీ చేసిన చుండ్రు (నందమూరి) సుహాసిని పరిస్ధితేంటో అందరూ చూసిందే. బలవంతంగా పోటీలోకి దింపి ఓడిపోయిన తర్వాత సుహాసిని ఫోన్ చేసినా చంద్రబాబు కనీసం సమాధానం ఇవ్వలేదు. ఈ విషయాన్నే ఆమె చెబితేనే అందరికీ తెలిసింది. సుహాసిని అనుభవం చూసిన తర్వాత కూడా ఆది శేషగిరిరావు చంద్రబాబు హామీని నమ్మి టిడిపిలో చేరుతున్నారంటే…