ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పిన విషయాలను ఏపీ సీఎం వైఎస్ జగన్ వేదంగా భావిస్తారని చాలామంది భావిస్తారు. వైసీపీ నేతలు సైతం జగన్ మోదీ అభిమాని అనే భావిస్తారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కు వ్యతిరేకంగా మోదీ నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు చాలా తక్కువనే సంగతి తెలీందే. డైరెక్ట్ గా బీజేపీకి సపోర్ట్ ఇవ్వకపోయినా ప్రతి సందర్భంలో మోదీ నిర్ణయాలకు జగన్ నిర్ణయాలకు మద్దతు ఇచ్చారు.
అయితే తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఏపీ అబద్దాల ప్రదేశ్ గా మారిందని చాలా రాష్ట్రాలతో పోలిస్తే అధ్వానస్థితికి చేరిందని ఆయన తెలిపారు. వైసీపీ పాలనలో పేదలు 100 రూపాయలు కూడా సంపాదించడం లేదని ఏపీలో కోటి మంది ఆకలితో అలమటిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. మోదీకి జగన్ దత్తపుత్రుడని ఆయన తెలిపారు.
జగన్ గురువులను బంట్రోతులుగా మారుస్తున్నారని ఆయన అన్నారు. ఒక్క ఛాన్స్ అంటే ప్రజలు జగన్ కు పట్టం కట్టారని ఇప్పుడు జగన్ ను సాగనంపడానికి ఎదురుచూస్తున్నారని ఆయన తెలిపారు. బీజేపీ దేశానికి ఏమీ చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఆయన కామెంట్ల గురించి జగన్ స్పందిస్తారేమో చూడాల్సి ఉంది. ఏపీకి మంచి జరగాలనే ఆలోచనతోనే జగన్ మోదీకి సపోర్ట్ చేస్తున్నారని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో వైసీపీ బీజేపీ కూటమి దిశగా అడుగులు పడితే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరించడం వైసీపీకే ప్లస్ అవుతోందని ఈ కారణం వల్లే వైసీపీ బీజేపీకి మద్దతు ఇచ్చే ఏ అవకాశాన్ని వదులుకోవడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. వైసీపీని అభిమానించే వాళ్ల సంఖ్య సైతం అంతకంతకూ పెరుగుతోంది.