ఏపీ తాత్కాలిక హైకోర్టు భవనాన్ని ప్రారంభించిన చీఫ్ జస్టిస్

అమరావతిలో హైకోర్టు శాశ్వత భవన నిర్మాణానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ రంజన్ గొగోయ్ శంకుస్థాపన చేశారు. అనంతరం తాత్కాలక హైకోర్టు భవనాన్ని ప్రారంభించారు. 450 ఎకరాల్లో బౌద్ధ స్థూపాకృతి ఆకారంలో హైకోర్టు శాశ్వత భవనాన్ని చేపట్టనున్నారు. దాదాపు 819 కోట్లతో 12.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరగనుంది.

జ్యూడిషియల్ కాంప్లెక్సులో హైకోర్టు తాత్కాలిక భవనం ప్రారంభించారు. 173 కోట్లతో ఈ భవనం నిర్మించారు. 23 కోర్టు హాళ్లు, అనుబంధ కార్యాలయాలు ఉన్నాయి. ఏజీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, న్యాయవాదుల అసోసియేషన్ హాళ్లను ఏర్పాటు చేశారు. అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ ను జస్టిస్ రంజన్ గొగోయ్ దంపతులకు సీఆర్డీఏ కమిషనర్ వివరించారు.

ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ లావు నాగేశ్వరరావు, ఏపీ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.