• ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్‌లో పతకాలు సాధించిన ముగ్గురు క్రీడాకారులకు గ్రూపు 2 కేడర్ పోస్టులలో నియమించేందుకు ఆంధప్రదేశ్ మంత్రిమండలి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఇండియన్ డెఫ్ టెన్నిస్ టీమ్ కెప్టెన్ షేక్ జఫ్రీన్, ఆస్ట్రేలియా క్వీన్స్ ల్యాండ్ గోల్డ్ కోస్టులో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టర్ రాగల వెంకట రాహుల్, 2018 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌లో జరిగిన వరల్డ్ కప్ పోటీలలో జిమ్నాస్టిక్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన అనంతపురం యువతి బుడ్డారెడ్డి అరుణలకు గ్రూప్ 2 కేడర్ పోస్టులు ఇవ్వడానికి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రిమండలి నిర్ణయించింది.
• ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ (రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్ టు పబ్లిక్ సర్విసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాట్రన్ అండ్ పే అండ్ స్ట్రక్చర్) 1994లోని యాక్ట్ 2ను సవరించడానికి ఆమోదం. అత్యుత్తమ ప్రతిభను కనబరచిన క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్ధేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
క్రీడాకారులకు ప్రోత్సాహకాలు :
• సౌతాఫ్రికాలో 2018 సెప్టెంబరులో జరిగిన వరల్డ్ జూనియర్ & సబ్ జూనియర్స్ ఉమెన్స్ ఛాంపియన్‌షిప్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో సిల్వర్ మెడల్ సాధించిన డి. అనూషకు రూ.10 లక్షల నగదు ప్రోత్సాహకం అందివ్వాలని మంత్రిమండలి నిర్ణయం. దీనికోసం స్పోర్ట్స్ పాలసీ, 2017-22లో కొంత సడలింపు ఇస్తారు.
• గోల్డెన్ డిస్క్ అవార్డ్ విన్నర్, యంగ్ ఆర్చర్ డాలీ శివానీకి రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందించాలని మంత్రిమండలి నిర్ణయం.
• ఇంటర్నేషనల్ యోగా ఛాంపియన్ ఏకాంబరం జోష్ణవికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని మంత్రిమండలి నిర్ణయం.
ఉద్యోగులకు బస్ పాస్ రాయితీ కొనసాగింపు :
• ప్రస్తుతం ప్రభుత్వం ఉద్యోగుల బస్సు పాస్ రాయితీని గతంలో వేతనం రూ.14860 – 39540 ఉన్నఉద్యోగులకు వర్తించగా.. ప్రస్తుతం 10 వ పీఆర్సీ సిఫార్సుల మేరకు రూ. 28940 – 78910 వేతనం ఉన్నవారికి అమలుపరుస్తూ కేబినెట్ ఆమోదం. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వం పై 5.14 కోట్ల రూపాయల భారం పడుతుంది. మొత్తం 7,194 మందికి లబ్ది చేకూరుతుంది. ఈ రాయితీ విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు, CRDA పరిథిలోని ఉద్యోగులకు వర్తిస్తుంది.