కిరణ్ కుమార్‌రెడ్డి లాలూచి పడ్డారు

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పెడదారిన సీఎం అయ్యారని, ఆయన ఒక కుట్రదారుడని వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. గతంలో తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వటం వలనే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నడిపారని, ప్రస్తుతం కాంగ్రెస్.. టిడిపితో కలిసి నడవకపోయినా భవిష్యత్తులో మద్దతు  ఇవ్వొచ్చన్నారు. దొంగ చాటున కండువాలు  వేసుకునే నాయకులు తమ జిల్లాలో పుట్టడం దురదృష్టకరమన్నారు. జగన్ వైసీపీ స్థాపించిన నాడే కాంగ్రెస్ పార్టీ చనిపోయిందని, ప్రస్తుతం కాంగ్రెస్ లో ద్రోహులు మాత్రమే మిగిలారని ఆయన ఎద్దేవా చేశారు.  ఎన్నికల ముందు ఖర్చు పెట్టకుండా చెప్పుల పార్టీ పెట్టాడని తద్వారా ప్రజల తిరస్కరణకు గురయ్యారన్నారు.

సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బద్ద శత్రువని, కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో ఓటమి భయం పట్టుకునే పెద్దిరెడ్డి ఆ విధంగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కిరణ్ ని సీఎంగా చేయటం పెద్దిరెడ్డికి ఇష్టం లేకే ఆ రోజ పార్టీ నుంచి పెద్దిరెడ్డి బయటికి వెళ్లిపోయారన్నారు. పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యల ప్రకారం కిరణ్ కుమార్ రెడ్డి నిజంగానే టిడిపితో లాలూచి పడ్డారా అనే చర్చ సాగుతోంది.