Siri Remuneration: ఓడియమ్మా.. సిరి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Siri Remuneration: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఏకైక లేడీ ఫైనలిస్ట్, పటాకా ఆఫ్ ది బిగ్ బాస్ హౌస్ ఎవరు అంటే.. టక్కున గుర్తొచ్చే పేరు సిరి హన్మంతు. ఈ మాట ఏకంగా బిగ్ బాసే స్వయానా తన నోటితో చెప్పాడు. ఈ ఇల్లు భావోద్వేగాల నిధి అయితే.. అందులో సిరివి నువ్వంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. 15 వారాలుగా సాగిన బిగ్ బాస్ లో సిరి టాప్ 5 లో చోటు దక్కించుకుని చివరి వరకు తన ప్రయాణాన్ని కొనసాగించింది. అంతే కాకుండా, ఫైనల్స్ లో నిలిచిన ఏకైక లేడీ కంటెస్టెంట్ గా సిరి చరిత్ర సృష్టించింది. ఫినాలేలో లేడీ కంటెస్టెంట్ ఉండటం ఒక కల అని అనుకుంటున్న తరుణంలో మెరుపు వేగంతో రాకెట్లా దూసుకొచ్చింది సిరి హన్మంతు.

గేమ్ అయినా, ఎమోషన్స్ అయినా తగ్గేదేలే అంటూ రెచ్చిపోయి.. అబ్బాయిలకి ధీటుగా పోటీపడి మరీ ఆడింది ఈ వైజాగ్ సోయగం. అయితే, తనలో ఉన్న కోపాన్ని సన్నీకి, ప్రేమను ప్రేమను షణ్ముఖ్ కి పంచిపెట్టింది ఈ లేడీ పటాకా. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో ఐదో స్థానంలో ఉండగానే ఎలిమినేట్ అయ్యింది సిరి హన్మంతు. అయితే బిగ్ బాస్ నుండి ఎంత ముట్టింది అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యింది.

తనకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేసుకుని ఒకవైపు వెబ్ సిరీస్ చేసుకుంటూ , మరోవైపు సీరియల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది సిరి. వారానికి దాదాపుగా లక్షన్నర నుండి రెండు లక్షల రూపాయల మేర ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఒకవేళ ఇదే గనక నిజమయితే సిరి ఇంచుమించుగా పాతిక లక్షల మేర గెలుచుకుంది అని సమాచారం. బిగ్ బాస్ టైటిల్ గెలవకపోయినా అందులో సగం అయినా సంపాదించి బయటకు వచ్చింది లేడి పటాకా సిరి హన్మంతు.