మిస్టర్ పర్ఫెక్ట్ బాలాదిత్యకి బిగ్ బాస్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

హీరోగా ఎన్నో సినిమాలలో నటించిన బాలాదిత్య అనుకోని కారణాలవల్ల సినిమాలకు దూరం కావలసి వచ్చింది. ఇలా చాలా కాలంగా అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్న బాలాదిత్య కి బిగ్ బాస్ మంచి అవకాశాన్ని అందించింది. ఇటీవల ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న బాలాదిత్యం అందరితో మంచిగా ఉంటూ.. బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులలో కూడా గట్టిగా పోరాడుతూ టాప్ ఫైవ్ కంటెస్టెంట్లలో ఒకరిగా ఉంటూ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా గుర్తింపు పొందాడు. ఇలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న బాలాదిత్య ఊహించని విధంగా ఇటీవల జరిగిన పదవ వారం ఎలిమినేషన్ లో ఎలిమినేట్ అయ్యి హౌస్ నుండి బయటికి వచ్చాడు. ఇప్పటికీ బాలాదిత్య ఎలిమినేషన్ ని ప్రేక్షకులు జర్నించుకోలేకపోతున్నారు.

ఈ బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పాల్గొన్న బాలాదిత్య టాప్ ఫైవ్ వరకు చేరుకోకపోయినా కూడా పాజిటివ్ టాక్ తో బయటికి వచ్చి మంచి గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో సినిమాలలో నటించే అవకాశాలు కూడా అందుకోవచ్చు. ఇదిలా ఉండగా ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో బాలాదిత్య రెమ్యూనరేషన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. చాలా కాలంగా అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్న బాలాదిత్య కి బిగ్ బాస్ యాజమాన్యం వారు మంచి రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ వర్గాలనుండి అందుతున్న సమాచారం ప్రకారం బాలాదిత్య ఒక వారానికి 65 వేల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.

ఇలా 10 వారాలపాటు హౌస్ లో కొనసాగిన బాలాదిత్య వారానికి 65వేల రూపాయల చొప్పున 10 వారాలకు గాను మొత్తం 6.5 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే అవకాశాలు లేక ఖాళీగా ఉన్న బాలాజీత్యకు ఈ రెమ్యూనరేషన్ చాలా ఎక్కువనే చెప్పవచ్చు. ఇలా బిగ్ బాస్ షోలో పాల్గొన్నందుకు మంచి రెమ్యూనరేషన్ అందుకోవటంతో పాటు ఇకపై టీవీ షో లలో, సినిమాలలో కనిపించే అవకాశాలు కూడా అందుకోనున్నాడు. బిగ్ బాస్ షో లో పాల్గొనటం వల్ల బాలాదిత్యకు మంచి జరిగినప్పటికీ టాప్ ఫైవ్ కంటెస్టెంట్లలో ఒకరిగా నిలవలేకపోయాడని అతని అభిమానులు బాధపడుతున్నారు.