బిగ్ బ్రేకింగ్: గుంటనక్క ఎవరో తేలిపోయిందిగా.!

బిగ్‌బాస్ హౌస్‌లో గుంటనక్క అనే టాపిక్‌తో మొదటి నుంచీ డిస్కషన్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మొదటే, ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది. కానీ, ఇంకా డైలమా అన్నట్లుగా కాస్త డ్రామా నడిచింది. అయితే, ఎట్టకేలకు గుంటనక్క ఈయనే.. అంటూ నటరాజ్ మాస్టర్ డైరెక్టుగా కన్ఫామ్ చేసేశారు.

యాంకర్ రవి తనకున్న మల్టీ టాలెంట్‌తో హౌస్‌ని తన చెప్పు చేతల్లోకి తీసుకోవాలని చూస్తున్నాడు. ఇక్కడి మాటలు అక్కడా, అక్కడి మాటలు ఇక్కడా చెప్పి, అవకాశానికి తగ్గట్లుగా గేమ్ ఆడుతున్నాడు.. అనే ఓ టాక్ డే 1 నుంచీ ఉంది. నటరాజ్ మాస్టర్ హౌస్ మెంబర్స్ అందర్నీ జంతువులతో పోల్చగా, అందులో గుంటనక్క క్యారెక్టర్ మాత్రం తనదే అని యాంకర్ రవి కూడా ఒప్పేసుకున్నాుడు.

ఈ విషయమై యాంకర్ రవికీ, నటరాజ్ మాస్టర్‌కీ ఛాన్స్ చిక్కినప్పుడల్లా తర్జన భర్జనలు జరుగుతూనే ఉన్నాయి. నటరాజ్ మాస్టర్ పట్ల పీకల్లోతు కోపంతో, అప్పుడప్పుడూ బయటపడిపోతూనే ఉన్నాడు యాంకర్ రవి. ఏది ఏమైతేనేం, గుంటనక్క ట్యాగ్ వేయించుకున్న యాంకర్ రవి, నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ తర్వాత హౌస్‌లో ఎలాంటి కొత్త ప్లాన్స్ వేసి, తన గేమ్ ముందుకు నడిపిస్తాడో చూడాలి మరి.