బిగ్ క్లారిటీ : నితిన్ మీటింగ్ తో ఎన్టీఆర్ విషయంలో కూడా అందరికీ ముగింపు.!

తాజాగా తెలుగు సినిమా దగ్గర పరిస్థితులు ఒక్కసారిగా ఆసక్తికరంగా మారిపోయాయి. సినిమా హీరోలు కేంద్ర స్థాయిలో పలువురు కీలక వ్యక్తులను కలుస్తుండడం రాజకీయ సహా సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలకు దారి తీస్తున్నాయి.

అయితే మొదట ఇది టాలీవుడ్ బిగ్గెస్ట్ మాస్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో స్టార్ట్ కాగా ఇది నిన్న రాత్రి యంగ్ హీరో నితిన్ రెడ్డి తో ముగిసింది. అయితే నితిన్ ని జేపీ నడ్డా కలవగా ఎన్టీఆర్ ని అమిత్ షా కలిశారు. అయితే నిన్న నితిన్ మీటింగ్ తో అయితే ఇప్పుడు ఎన్టీఆర్ మీటింగ్ వెనుక ఉన్న అసలు కారణం కూడా రివీల్ అయ్యినట్టు ఇప్పుడు బయటకి వచ్చింది.

ఎన్టీఆర్ ని షా కలిసింది సినిమా విషయం కోసం కాదని రాజకీయ అంశాల చర్చ కోసం కూడా వారి మధ్య సంభాషణ జరిగింది అని నిన్న నితిన్ మీటింగ్ తర్వాత ఆ బీజేపీ వర్గాల నుంచి ఈ బిగ్ క్లారిటీ బయటకి వచ్చింది.

దీనితో ఇప్పుడిప్పుడే అందరికి కూడా ఎన్టీఆర్ తో భేటీ వెనుక అసలు కారణం అందరికీ వెల్లడి అవుతుంది అని చెప్పాలి. మరి నిన్న నితిన్ తో కూడా పొలిటికల్ అంశాలు చర్చిండం జరిగింది అని నడ్డా తెలిపారు. మరి రానున్న రోజుల్లో అయితే పరిస్థితులు ఎలా మారుతాయో చూడాలి.