టాలీవుడ్ హీరోలంతా ఇలా మారిపోయారేంటి?

తెలుగు ప్రేక్షకులు కూడా కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టే మన తెలుగు హీరోస్ కూడా కొత్త స్టైల్స్, ట్రెండీ లుక్స్ తో అదరగొడుతున్నారు. మూవీ మూవీ కి గెటప్స్ చేంజ్ చేసేస్తున్నారు. ఈమధ్య మన హీరోలంతా గడ్డాలు, మీసాలు పెంచేసుకుని డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నారు. ఏళ్ళ తరబడి అదే గెటప్ లో ఉంటున్నారు.

నాన్నకు ప్రేమతో, జై లవకుశ సినిమాల్లో గడ్డంతోనే ఉన్న జూనియర్ ఎన్టీఆర్, రంగస్థలం కోసం సంవత్సరం పాటు గడ్డాన్ని కాపాడుకున్నాడు చిరు తనయుడు చరణ్ తేజ్. సవ్యసాచి మూవీలో గడ్డం లుక్ లో కనపడనున్న చైతు. ఇక బాహుబలి కోసం ప్రభాస్ గడ్డం, మీసంతో పాటు జుట్టు కూడా పెంచేశాడు. సైరా మూవీ కోసం మెగాస్టార్ కూడా ఇదే తరహాలో కనిపిస్తున్నాడు. శాతకర్ణిలో బాలకృష్ణ కూడా అంతే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి చెప్పక్కర్లేదు. మిల్క్ బాయ్ మహేష్ కూడా గడ్డం మీద దృష్టి పెట్టాడంటే ఈ గడ్డం ఏం మాయం చేసిందో మన హీరోలని. వున్నది ఒకటే జిందగీలో రామ్, కృష్ణార్జున యుద్ధంలో నాని, అర్జున్ రెడ్డిలో విజయ్ ఇలా ఒకరేమిటి ఆల్మోస్ట్ అందరు హీరోలు గడ్డం బాట పట్టేశారు.