తెలుగు సినిమా దగ్గర ఏ బిగ్ స్టార్ బర్త్ డే వచ్చినా కూడా ఇతర సినీ ప్రముఖులు వారితో సమాన క్రేజ్ ఉండే హీరోలు దర్శకులు కూడా తమ బర్త్ డే విషెస్ ని తెలియజేస్తారు. అయితే నిన్న అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే కాగా అనేక మంది సినీ అలాగే రాజకీయ ప్రముఖులు కూడా పవన్ పేరు పేరున బర్త్ డే విషెస్ తెలియజేసారు.
ఇదంతా బాగానే ఉంది కానీ కొందరు సినీ ప్రముఖులు అందులో కొందరు పవన్ విషయంలో మొహం చాటేయడం అన్ని సార్లు లానే చర్చనీయాంశంగా మారింది. మరి ఇంతకీ వారెవరో కాదు మెగా ఫ్యామిలీ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే మరొకరు పాన్ ఇండియా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి లు.
ఈ ఇద్దరు కూడా పవన్ కి నిన్న ఎలాంటి బర్త్ డే విషెస్ తెలియజేయకపోవడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజమౌళి చాలా సార్లు పవన్ విషయంలో మంచి కామెంట్స్ చేయడం జరిగింది. అలాగే బన్నీ కూడా అంతే.. కానీ ఈ ఇద్దరు కూడా మౌనంగా ఉండడం ఫ్యాన్స్ లో చరచగా మారింది.
ఇక ప్రభాస్ సంగతి వస్తే ఇది వరకు పవన్ విషయంలో తాను పెద్దగా మాట్లాడిందే లేదు కాబట్టి అభిమానులు అయితే ఈ విషయం అంతగా పట్టించుకోలేదు. కానీ అల్లు అర్జున్ రాజమౌళి లు మాత్రం మాట్లాడకుండా ఉండడం అనేది ఆశ్చర్యంగా మారింది.