శభాష్: మన తెలుగు కుర్రాడే..హాలీవుడ్ లో హిట్ కొట్టాడు

ప్రపంచం రోజు రోజుకు చిన్నదై పోతోంది. ఒకప్పుడు హాలీవుడ్ సినిమా చూడాలంటే..అది థియోటర్ కు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసి చూడాలి. ఇప్పుడు రకరకాల మాధ్యమాల ద్వారా హాలీవుడ్ ని అందిపుచ్చుకుంటున్నారు. హాలీవడ్ సినిమాలు డైరక్ట్ గా డబ్బింగ్ వెర్షన్ తో ఇక్కడ రిలీజ్ అవుతున్నాయి. 

అక్కడితో ప్రస్దానం ఆగలేదు. ఇప్పుడు మనవాళ్లు హాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నారు. సినిమాలు చేయటానికి ఏముంది గతంలో ఎస్వీ కృష్ణారెడ్డి కూడా ఇంగ్లీష్ సినిమా తీసాడు. అయితే ఇప్పుడు మన తెలుగు కుర్రాడు హిట్ కొట్టాడు హాలీవుడ్ లో అదీ చెప్పుకోదగ్గ విషయం.

ఆ కుర్రాడే  అనీష్‌ చాగంటి… ఈ తెలుగు కుర్రాడి పేరు ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో తెగ వినపడుతోంది.  అతనిది హైదరాబాదే. ఈ కుర్రాడు ఇంటర్వూలు హాలీవుడ్ పత్రికలు సైతం ప్రచురిస్తున్నాయి. ఇంతకీ ఆ కుర్రాడు వయస్సు 26 ఏళ్లు. ఈ చిన్న వయసులోనె దర్శకుడిగా తొలి ప్రత్నంలోనే హాలీవుడ్‌లో సూపర్ హిట్ ఇచ్చాడు అనీష్‌ చాగంటి. రీసెంట్ గా విడుదలైన అనీష్ మొదటి సినిమా  ‘సెర్చింగ్‌’.ఈ సినిమా ఓ థ్రిల్లర్. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ఈ సినిమా ఇప్పటికే చాలా అవార్డ్ లు పొందింది. 

ఈ సినిమా కథేంటంటే.. సోషల్ మీడియా ఎక్కువగా ఉపయోగించే ఓ టీనేజ్‌ కూతురు అనుకోకుండా మాయమైతే ఆమె కోసం అదే టెక్నాలిజీ సాయంతో తండ్రి చేసే అన్వేషణగా కథను తీర్చిదిద్దాడు.  విడుదలకు ముందే ప్రతిష్ఠాత్మక సన్‌డ్యాన్స్‌ చిత్రోత్సవంలో ప్రదర్శితమైంది.  ప్రముఖ హాలీవుడ్‌ సంస్థ సోనీ పిక్చర్స్‌ ఈ చిత్రాన్ని విడుదల చేంది.  ఈ చిత్రం ఇప్పటికే 32 మిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.231 కోట్లు) పైగా వసూలు చేసింది.