మీడియా అధినేతలతో స్టార్లు ఎంత కేర్ ఫుల్ గా ఉంటారో చూసేదే. లైవ్ ఇంటర్వ్యూల్లో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఏం కావాలన్నా తమకు కవరేజీ ఇచ్చేది మీడియానే అనే గౌరవం ఉంటుంది కాబట్టి చాలామంది స్టార్లు అనవసరంగా గొడవలకు దిగరు. మీడియాధిపతులకు ఎంతో గౌరవం ఇస్తుంటారు. అప్పుడప్పుడు నెగెటివ్ కథనాలు వచ్చినా సాఫ్ట్ గానే స్పందిస్తుంటారు. అయితే ఇటీవలి కాలంలో సెలబ్రిటీల తీరు మారినట్టే కనిపిస్తోంది. తమను అయిన దానికి కానిదానికి షంటేసే మీడియా విషయంలో ఎంతో ఆచితూచి ఆలోచించేవాళ్లంతా మొన్న దేవరకొండ ఎపిసోడ్ తో ఇప్పుడు డైరెక్టవుతున్నారు. మీడియాపై తమ కోపాన్ని నేరుగానే వెల్లగక్కుతున్నారు.
అదంతా సరే కానీ.. ఎంత పెద్ద మీడియా అయినా కానీ టాలీవుడ్ కి చెందిన ఆ స్టార్ హీరో మాత్రం అస్సలు పట్టించుకోనే పట్టించుకోడు. సరికదా.. డైరెక్టుగా ఏదైనా ఇంటర్వ్యూకి ముఖాముఖికి వెళ్లినప్పుడు పూర్తిగా సింగులర్ లోనే ఎదుటివారిని పిలుస్తాడు. ఎలాంటి ప్రశ్న అడిగినా ముక్తసరి ఆన్సర్ తో సరిపెట్టేస్తాడు. ఎలాంటి అదనపు సమాచారం ఇవ్వడానికి ఇష్టపడడు. ఓపెన్ హృదయం పేరుతో ఇంటర్వ్యూలు చేసే ఆ మీడియాధినేతను సదరు స్టార్ హీరో నాటి ఇంటర్వ్యూలో అలానే షంటేసాడు. అస్సలు ఎదుట ఉన్నది మీడియాధిపతి అనే భయం కానీ.. భీతి కానీ ఆ హీరోలో అస్సలు కనిపించలేదు. పక్కాగా సింగులర్ వాడేస్తూ పిలిచాడు. ఇక సారు అని బాబు అని పిలవడం బావుండదు అంటూ అతడు ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడంతో అందుకు తగ్గట్టే కొట్టినట్టే సమాధానాలిచ్చాడు ఆ హీరో. స్టార్ హీరో అన్నాక ఆ మాత్రం పొగరుండాలమ్మా!! అంటూ ఆ ఇంటర్వ్యూ చూసినవాళ్లు అర్థం చేసుకున్నారు మరి.