Samantha: సినీనటి సమంత తన అనారోగ్య సమస్యల కారణంగా కొద్ది కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈమె తిరిగి చాలా యాక్టివ్ అవుతూ ఇండస్ట్రీలో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఒకవైపు సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా మారి సినిమాలను కూడా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సమంత తన హోమ్ బ్యానర్ లో నిర్మించిన మొట్టమొదటి చిత్రం శుభం.
ఈ సినిమా హర్రర్ కామెడీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో
హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి, శ్రియ కొణతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపూడి, వంశీధర్ గౌడ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక సమంత కూడా అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం మే తొమ్మిదవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇటీవల వైజాగ్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సమంత ఎన్నో విషయాలను తెలియచేశారు వైజాగ్లో ఈవెంట్ చేసుకున్న సినిమాలన్నీ కూడా మంచి సక్సెస్ అందుకున్నాయని అలాగే తన సినిమాలను కూడా ఈమె గుర్తు చేసుకున్నారు. మూవీ చూశాక అందరు కూడా చిరు నవ్వుతోనే బయటకు వస్తారని పేర్కొంది. ప్రమోషనల్ కంటెంట్ చూసి హరర్ కామెడీ అని అనిపిస్తుంది కాని, ఇది వేరే సినిమా అని తెలియజేశారు.
ఇక సమంతను చూడటం కోసం పెద్ద ఎత్తున అభిమానులు రావడంతో వారందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం ఈ సినిమాలోని ఒక పాటకు సమంత వేదికపైనే డాన్స్ చేస్తూ అందరిని సందడి చేశారు. అదేవిధంగా ఈ సినిమాలో నటించిన హర్షిత్ రెడ్డి వేదికపై మాట్లాడుతూ..రాజ్ అండ్ డీకే కారణంగానే ఈ సినిమాలో నటించే అవకాశం దక్కింది. స్టోరీ చెప్పినప్పుడే పడి పడి నవ్వుకున్నాను, హారర్ కామెడీని ఇలా కూడా తియ్యొచ్చా అనుకున్నాను. అండ్ సమంత మామ్ ఐ లవ్ యూ.. మీరు చాలా బాగా సపోర్ట్ చేశారు అంటూ వేదికపైనే సమంతకు ప్రపోజ్ చేయడంతో సమంత కూడా లవ్ సింబల్ చూయిస్తూ రిప్లై ఇవ్వడంతో ఇది కాస్త సంచలనగా మారింది.