Star Hero: గుర్తు పట్టలేనంతగా మారిన టాలీవుడ్ స్టార్ హీరో… కన్నీళ్లు పెట్టుకుంటున్న అభిమానులు?

Star Hero: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్న వారిలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. ఈయన హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో సినిమాలలో నటించారు. అయితే ఇటీవల కాలంలో రవితేజ నటిస్తున్న సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఈయన చివరిగా శ్రీలీలతో కలిసిన నటించిన ధమాకా సినిమా మాత్రమే మంచి సక్సెస్ అందుకుంది.

ఈ సినిమా తర్వాత దాదాపు నాలుగు సినిమాల వరకు నటించిన రవితేజ ఏ ఒక్క సినిమాతో కూడా హిట్ అందుకోలేకపోయారు ఈయన చివరిగా మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా కూడా నిరాశపరిచింది.. ప్రస్తుతం ఈయన మాస్ జాతర అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో కూడా శ్రీ లీల నటించటం విశేషం.

ఇలా పలు సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నా రవితేజకు సంబంధించి ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ ఫోటో చూసిన అభిమానులు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేంటి రవితేజ అలా మారిపోయారు అసలు ఇక్కడ ఉన్నది రవితేజనేనా గుర్తుపట్టలేకపోయినంతగా మారిపోయారు అంటూ కామెంట్లో చేస్తున్నారు.

ఈ ఫోటోలో రవితేజ చాలా బక్క చిక్కిపోవడమే కాకుండా తన ఫేస్ లో కూడా ఏదో తేడా కనిపిస్తున్న నేపథ్యంలో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రవితేజ ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏదైనా కొత్త సినిమా కోసం ఈయన ఇలాంటి లుక్ లో కనిపించబోతున్నారా లేకపోతే ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా అంటూ అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.