మహేష్, రాజమౌళి.. ఇంకో టాలీవుడ్ స్టార్ హీరో.!

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కనున్న సినిమాకి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అతి త్వరలో సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్ళాలని రాజమౌళి, తన టీమ్‌ని మరింత అప్రమత్తం చేస్తున్నాడట.

లుక్ టెస్ట్ నిమిత్తం మహేష్ విదేశాలకు వెళ్ళినట్లు ప్రచారం జరుగుతోంది. విదేశాల నుంచి మహేష్ కొన్ని ఫొటోలు విడుదల చేసిన దరిమిలా, లుక్ టెస్ట్ జరుగుతోందా.? లేదా.? అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా వుంటే, ఈ ప్రాజెక్టు కోసం ఓ టాలీవుడ్ స్టార్ హీరోతో రాజమౌళి సంప్రదింపులు జరుపుతున్నాడట. రాజమౌళి అడిగితే, టాలీవుడ్‌లో ఏ స్టార్ హీరో అయినా కాదంటాడా.? అన్నట్టు, అది నెగెటివ్ రోల్ కాదట.. ఓ ఇంట్రెస్టింగ్ రోల్ అట.

టాలీవుడ్ మాత్రమే కాదు, కోలీవుడ్, బాలీవుడ్.. ఇలా దేశంలోని ఏ సినీ పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు అయినా, రాజమౌళి సినిమా కోసం క్యూ కట్టేస్తారనడం అతిశయోక్తి కాదు.

అయితే, రాజమౌళి ఓటు, టాలీవుడ్ హీరో వైపే వుందని అంటున్నారు. ఎవరా హీరో.? ఏమా కథ.? అంటే, అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్. కొద్ది రోజుల్లోనే దీనిపై స్పష్టత ఇవ్వబోతున్నారట. ఆ తర్వలో ఎప్పుడు.? జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అంతే.!