Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన హీరోగా ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయి కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు. నటుడుగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్న ప్రభాస్ ప్రస్తుతం ఐదు పాన్ ఇండియా సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఇలా స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న ప్రభాస్ వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన పెద్దగా ఎలాంటి కార్యక్రమాలలోనూ పాల్గొనరు.
ఇక ప్రభాస్ కి స్నేహితులంటే ఎంతో ప్రేమ అనే విషయం తెలిసిందే స్నేహితుల కోసం ఎంతటి సాహసానికైనా వెనకాడరు అయితే ప్రభాస్ కి ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చాలా తక్కువ అని చెప్పాలి. ఇక ఈయనకు అత్యంత ఆప్తుడు అయినటువంటి హీరోలలో నటుడు గోపీచంద్ ఒకరు గోపీచంద్ ప్రభాస్ ఇద్దరు చాలా మంచి స్నేహితులనే విషయం మనకు తెలిసిందే. ఇలా తన ప్రాణ స్నేహితుడైన ప్రభాస్ కారణంగా గోపీచంద్ తన కెరియర్ను కోల్పోయారని తెలుస్తుంది.
ప్రభాస్ గోపీచంద్ ఇద్దరు కలిసి వర్షం సినిమాలో నటించిన విషయం తెలిసిందే ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించిన విలన్ పాత్రలో గోపీచంద్ నటించారు. ఇక ప్రభాస్ పాన్ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతూ ఉండగా గోపీచంద్ మాత్రం పలు సినిమాలలో నటిస్తూ సక్సెస్ కోసం పోరాటం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే ప్రభాస్ ను నమ్మి యువి క్రియేషన్స్ తో కొలాబెరేట్ అయి ఆయన చేసిన సినిమాలు మాత్రం వరుసగా డిజాస్టర్ల బాటపట్టాయి.
గోపీచంద్ కు యువి క్రియేషన్ లో జిల్, పక్కా కమర్షియల్ అనే సినిమాలు చేసిన విషయం తెలిసిందే అయితే ఈ రెండు సినిమాల స్టోరీలు ఆయనకు పెద్దగా నచ్చకపోయినా కేవలం ప్రభాస్ ఫోర్స్ తోనేసినిమాలు చేశారు. అయితే ఈ రెండు సినిమాలు కూడా తనకు నిరాశను మిగిలించడంతో కెరీర్ పరంగా గోపీచంద్ మరింత వెనక్కి వెళ్లిపోయారనే చెప్పాలి.
