సోనాలి బింద్రే తన నటనతో ప్రేక్షకుల మదిని దోచుకున్న నటి. ఆమె ప్రస్తుతం హైగ్రేడ్ సమస్యతో బాధపడుతున్నారు. . ఈ విషయాన్ని తనే అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ విషయం తెలిసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ప్రస్తుతం సోనాలి బింద్రే న్యూయార్క్ లో ట్రిట్ మెంట్ తీసుకుంటున్నారు. ఈ మధ్యే చికిత్స నిమిత్తం తను జుట్టు కత్తిరించుకున్న ఫోటోలు కూడా అభిమానులతో షేర్ చేసుకున్నారు. అయితే సోనాలికి ఒక కొడుకు ఉన్నారు. అతనికి ఈ విషయం చెప్పటానికి తను ఎంత సతమతమయ్యిందో వివరించింది సోనాలి.
“12 ఏళ్ల పదకొండు నెలల 8 రోజుల నుంచి రణ్ వీరు నా హృదయానికి యజమానిగా మారాడు. అతను పుట్టినప్పటి నుండే మా దాంపత్య జీవితంలో వెలుగులొచ్చాయి. నాకు హైగ్రేడ్ క్యాన్సర్ వచ్చిందని తెలిసినప్పటి నుండి నేను, నా భర్త గోల్డీ ఈ విషయాన్ని రణ్ వీరుకి ఎలా చెప్పాలా అని ఇబ్బంది పడ్డాను. ప్రతి నిజం వాడికి తెలియాలనుకున్నాం. ఎందుకంటే వాడి రక్షణ మా బాధ్యత. నిజాయితీగా వాడికి నా వ్యాధి గురించి చెప్పా. వాడు చాలా మెచ్యూరుగా నా సమస్యను అర్ధం చేసుకున్నాడు. అప్పటి నుంచి నాకు సహాయంగా వాడే పనులు చేస్తున్నాడు. ఇటువంటి సమస్యలను ఏ తల్లిదండ్రులైనా పిల్లలతో పంచుకోవడం మంచిదని నేను భావిస్తున్నాను. రణ్ వీరుతో ప్రస్తుతం నేను ఎక్కువ సమయం గడుపుతూ ఆనందంగా ఉంటున్నాను. వేసవి సెలవుల వల్ల వాడితో ఎక్కువగా గడిపే సమయం నాకు దొరికింది. వాడి అల్లరి చేష్టలు నాలో బలాన్ని నింపినట్టు అనిపిస్తున్నాయంటూ” సోనాలి తన కుమారుడితో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ హృదయానికి హత్తుకునేలా భావోద్వేగపూరితమైన ట్వీట్ చేసింది.
(సోనాలి బింద్రే ట్వీట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)