రాజమౌళి లాంచ్ : టీజర్ చూస్తే అద్బుతం అంటారు (వీడియో)

బొంబాయి సినిమాతో సినిమాటోగ్రాఫర్ గా దేశావ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు రాజీవ్ మీనన్. ఆ తరువాత కూడా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన గురు, కడలి లాంటి సినిమాలతో పాటు మార్నింగ్ రాగా లాంటి అవార్డ్ విన్నింగ్ సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించారు. యాడ్ ఫిలిం మేకర్ గా కూడా మంచి పేరున్న రాజీవ్ మీనన్ రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు.

రాజీవ్ మీనన్ అప్పట్లో 1997లో మెరుపు కలలు సినిమాతో డైరక్టర్ గా మారారు. ఆ తర్వాత ప్రేయసి పిలిచే ని డైరక్ట్ చేసారు. అవి అవార్డ్ లు తెచ్చిపెట్టాయి. మెరుపు కలలు సినిమాతో రాజీవ్ మీనన్ నాలుగు జాతీయ అవార్డులు సాధించి సత్తా చాటాడు.

Sarvam Thaala Mayam - Official Telugu Teaser | Rajiv Menon | A R Rahman | GV Prakash | JioStudios

తరువాత ప్రియురాలు పిలిచింది సినిమాతో జాతీయ అవార్డు సాధించాడు. కానీ ఆ రెండు సినిమాలు కమర్షియల్ గా పే ఆఫ్ కాలేదు. దాంతో తిరిగి ఆయన సినిమాటోగ్రాఫర్ గానే కెరీర్ ని కొనసాగించారు. అయితే తాజాగా ఆయన మరోసారి సర్వం తాళ మయం అనే చిత్రం డైరక్ట్ చేసారు.

దాదాపు 17 ఏళ్ల తరువాత మరోసారి తన దర్శకత్వంలో సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజీవ్ మీనన్. కోలీవుడ్ యంగ్ హీరో జివి ప్రకాష్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రిలిజ్ కు రెడీ అయ్యింది. ఈ చిత్రం తెలుగు వెర్షన్ ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ ని రాజమౌళి లాంచ్ చేసారు.

ఈ సినిమాలో జీవీకి జంటగా అపర్ణా బాలమురళి నటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ టీజర్‌ను రిలీజ్ చేశారు.జియో స్టూడియోస్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతమందిస్తున్నారు.