ప్రభాస్ ఇస్తానంటున్న సర్పైజ్ ఇదే? (వీడియో)

మే 21న ‘సాహో’ సర్‌ప్రైజ్‌ ఉందంటూ ప్రభాస్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్‌ చేసారు. అంతేకాదు ఆ సర్ ప్రైజ్ ని తన సోషల్‌మీడియా ఎక్కౌంట్ లో దాన్ని విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. దీనికి వెంటనే దగ్గుపాటి రానా రిప్లై ఇచ్చారు. ‘సర్‌ప్రైజ్‌ కోసం ఎదురుచూస్తున్నా..’ అని పోస్ట్‌ చేశారు.

అయితే ఇంతకీ ప్రభాస్ ఇవ్వబోయే సర్పైజ్ ఏమిటి అనేది ఇప్పుడు ఫ్యాన్స్ లో క్యూరియాసిటీగా మారింది. అందుతున్న సమాచారం మేరకు .. మంగళవారం సాహో సినిమా టీజర్‌ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే ఫ్యాన్స్ కు ప్రభాస్ ఇవ్వబోతున్న సర్ ఫ్రైజ్ అని వినికిడి.

‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న చిత్రం ‘సాహో’. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని… యువీ క్రియేషన్స్‌ నిర్మిస్తోంది. ఇందులో ప్రభాస్‌ సరసన శ్రద్ధాకపూర్‌ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆగస్ట్ 15 న రిలీజ్ కానున్న ఈ సినిమాకు ప్రమోషన్స్ మెదలెట్టేసారు.

ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ హీరోయిన్ గా నటిస్తున్నారు. నీల్‌ నితిన్‌ ముకేష్‌, వెన్నెల కిశోర్‌, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, అరుణ్‌ విజయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 15న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.