జనానికి కులం ఫీలింగే ఎక్కువ
తెలుగు జనాలకు సూపర్‌స్టార్ల కంటే కులం అంటేనే పిచ్చెక్కువా? కులం ఫీలింగ్‌తో నిత్యం కొట్టుకు చస్తుంటారా? తెలుగు రాష్ట్రాల్లో కుల ప్రభావమే ఎక్కువా? అంటే అవుననే రామ్‌గోపాల్ వర్మ తనదైన మార్క్ పంచ్ లు వేస్తున్నారు. సూపర్‌స్టార్ ఇంట్రో కంటే కులం ఫీలింగ్ పైనే జనం ఎక్కువ మక్కువ చూపించారని ప్రూవైంది అంటూ తన లిరికల్ వీడియోని ఉదాహరణగా చెప్పారు. సూపర్ స్టార్ మహేష్ పుట్టినరోజు కానుకగా నేడు రిలీజ్ చేసిన `సరిలేరు నీకెవ్వరు` ఇంట్రోని మించి `కమ్మ రాజ్యంలో కడప రెడ్లు` లిరిక్ గూగుల్ లో ట్రెండింగ్ లో ఉంది. నంబర్ 2 పొజిషన్ లో ఉన్నాం అంటూ తనకు తానుగానే సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు రామ్ గోపాల్ వర్మ.
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు లిరికల్ గీతాన్ని నేటి ఉదయం రామ్ గోపాల్ వర్మ తన సామాజిక మాధ్యమాల్లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇది గూగుల్ లో టాప్ ట్రెండిగ్ లో ఉంది. జనాలకు సూపర్ స్టార్ కంటే కులం ఫీలింగే ముఖ్యం. ఇది వెరీ బ్యాడ్! అంటూ ఆర్జీవీ దీనిని ప్రచారం చేసుకోవడం ఆసక్తికరం. ప్రచారం బావుంది కానీ.. ఆర్జీవీ పనితనం ఏమేరకు చూపిస్తారు? అన్నది ఇంపార్టెంట్.