అక్టోబర్ 15న థియేటర్లలో రిలీజ్ అయ్యే ఫస్ట్ మూవీ అదే

rgv corona virus movie to release on october 15

అన్ లాక్ 5.0 లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 15 నుంచి థియేటర్లు, మల్టీప్లెక్స్ లను తెరుచుకోవచ్చని వెల్లడించింది. దీంతో సినీ ఇండస్ట్రీ కూడా తమ సినిమాలతో రెడీ అవుతోంది. అయితే.. సినిమా థియేటర్లు అయితే ఓపెన్ అవుతాయి కానీ.. జనాలు వచ్చి సినిమాలు చూస్తారా? అనేదే ప్రస్తుతం పెద్ద ప్రశ్నగా మారింది.

rgv corona virus movie to release on october 15
rgv corona virus movie to release on october 15

ఏది ఏమైనా అక్టోబర్ 15 నుంచి సినిమా హాళ్లు ఓపెన్ కాబోతున్నాయి. దీంతో ఇప్పటికే పూర్తయిన సినిమాల రిలీజ్ కు మూవీ యూనిట్లు సన్నాహాలు చేస్తున్నాయి.

అయితే.. అక్టోబర్ 15న సినిమా థియేటర్లు ఓపెన్ కాగానే రిలీజ్ అయ్యే సినిమా కరోనా వైరస్. అవును..సినిమా పేరే కరోనా వైరస్. ఆ సినిమాను వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించారు.

కరోనా సమయంలోనే ప్రభుత్వం లాక్ డౌన్ విధించినప్పుడే ఆ సినిమాను తీశారు. ఆర్జీవీ.. లాక్ డౌన్ టైమ్ లో కరోనా వైరస్ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు కూడా తీసి తన వెబ్ సైట్ లో రిలీజ్ చేశారు.

కరోనా వైరస్ ను కూడా తన వెబ్ ప్లాట్ ఫాం ద్వారా విడుదల చేయాలని ఆర్జీవీ భావించినప్పటికీ… అన్ లాక్ 5.0 లో భాగంగా.. థియేటర్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్టోబర్ 15నే సినిమాను డైరెక్ట్ గా థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు ఆర్జీవీ ప్రకటించారు.

rgv corona virus movie to release on october 15
rgv corona virus movie to release on october 15

లాక్ డౌన్ తర్వాత.. థియేటర్లలో విడుదల కాబోయే మొదటి చిత్రం కరోనా వైరస్ అని వర్మ తన సోషల్ మీడియా అకౌంట్లలో ప్రకటించారు. కరోనా వైరస్ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను కూడా వర్మ రిలీజ్ చేశారు.

ప్రస్తుతం ఆర్జీవీ దిశ ఎన్ కౌంటర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం, నిందితుల ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఆ సినిమా తెరకెక్కుతోంది.