అరియానా కోసం రంగంలోకి దిగిన ఆర్జీవీ.. గెలిపించడంటూ ప్రచారం!!

Ram gopal Varma Request People to Vote Ariyana

రామ్ గోపాల్ వర్మ మొదటి సారిగా ఇలాంటి ఓ పని చేసి ఉంటాడు. అందరిలోనూ వర్మ వేరుగా ఉంటాడు. రియాల్టీ షోలు, బిగ్ బాస్ వంటి వాటిపై అతనికి శ్రద్ద ఉండదు. మొన్న ఒకసారి ఇదే విషయంలో ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. తాను అలాంటివి చూడను.. వాటి గురించి తెలీదని చెప్పుకొచ్చాడు. కానీ తన వల్లే ఫేమస్ అయిన అరియానా బిగ్ బాస్ షోలో ఉందని, ఇంత పాపులార్టీ వచ్చిందని తెలుసంటూ చెప్పుకొచ్చాడు.

అరియానాను హీరోయిన్‌గా పెట్టి ఓ సినిమా కూడా తీస్తానని వర్మ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో అరియానా బ బయటకు వస్తే వర్మ చేతుల్లో పడ్డటే. అసలే వర్మ ముట్టుకున్న ప్రతీ అమ్మాయి సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. ఇంటర్వ్యూ కోసం వచ్చిన అరియానాను తన మాటలతో బిగ్ బాస్ వరకు పంపించాడు వర్మ. నీ తొడలు బాగున్నాయి.. నువ్ బికినీ వేసుకుంటే చూడాలని ఉందంటూ వర్మ అరియానాను ఫ్లర్ట్ చేసిన విధానంతో బాగా పాపులర్ అయింది.

Ram gopal Varma Request People to Vote Ariyana
Ram gopal Varma Request People to Vote Ariyana

అలా అరియానా బిగ్ బాస్ వరకు వెళ్లింది. బిగ్ బాస్ షోకి వెళ్లడమే కాదు.. టాప్ 5 కంటెస్టెంట్‌గా అర్హత కూడా సాధించేలా ఉంది. జనాల నాడిని బట్టి చూస్తే అరియానా టాప్ 3లో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇంకొందరు ఆమె టైటిల్ విన్నర్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. అయితే అరియానా కోసం ఆర్జీవీ రంగంలోకి దిగి ఓట్లు అడుగుతున్నాడు. ఆమెకు ఓట్లు వేసి గెలిపించండని కోరాడు. వర్మ ఇలా ఇంత వరకు ఎవ్వరి కోసం చేయలేదు.