Home Entertainment మరో సంచలనానికి తెరదీసిన వర్మ.. ‘దిశా’ ఫస్ట్ లుక్

మరో సంచలనానికి తెరదీసిన వర్మ.. ‘దిశా’ ఫస్ట్ లుక్

రామ్ గోపాల్ వర్మ చేసే సినిమాలు, వేసే ట్వీట్లు, పెట్టే కామెంట్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడు ఎలా ఉంటాడో, ఏం మాట్లాడతాతో, ఏ సినిమా తీస్తాడో, ఎవరిపై విమర్శనాస్త్రాలు సంధిస్తాడో చెప్పడం కష్టం. రెండు తెలుగు రాష్ట్రాల్లో లాక్డౌన్ సమయంలో వర్మ చేసినంత రచ్చ.. పొందిన అటెన్షన్ కరోనా కూడా పొంది ఉండదు. క్లైమాక్స్, నగ్నం, పవర్ స్టార్, మర్దర్ ఇలా వరుస చిత్రాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు.

ప్రణయ్ హత్యకేసు ఆధారంగా తెరకెక్కిస్తోన్న మర్డర్ చిత్రంపై కేసులు నడుస్తున్నాయి. ఇరు పక్షాల వాదనలు వినిపిస్తున్నారు. వర్మ సంగతి తెలిసిందే కదా. ఇలాంటి వివాదాలపై సినిమాలను తీసి మరింత సన్సేషన్ క్రియేట్ చేయాలని చూస్తాడు. తద్వారా తన పేరు నిత్యం వార్తల్లో వినిపిస్తూ ఉంటుంది. అందుకే దేశంలో ఎక్కడైనా సెన్సేషన్ జరిగితే వర్మ కన్ను దానిపై పడుతుంది. ఆ మధ్య హైద్రాబాద్ పరిసర ప్రాంతంలో జరిగిన దిశ హత్యకేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Rgv Disha Movie First Look
RGV Disha Movie First Look

దిశను హత్య చేసి చంపిన కేసులో నలుగురిని ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై వర్మ ఎప్పుడో కర్చీప్ వేసేశాడు. ఆ మధ్యే దిశ నిందితుల్లో ఒకరైన చెన్నకేశవుల భార్యను తన ఆఫీస్‌కు పిలిపించుకుని మాట్లాడాడు వర్మ. తాజాగా ‘దిశ’పై చేయబోతోన్న సినిమాకు సంబంధించిన అప్డేట్‌ను ప్రకటించాడు. ఘటనకు కారణమైన స్కూటీ, లారీ, టోల్ గేట్ వంటి వాటితో రిలీజ్ చేసిన దిశా ఎన్‌కౌంటర్ ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ఇక టీజర్‌ను సెప్టెంబర్ 26న రిలీజ్ చేయనున్నాడట. దిశ ఘటన జరిగిన రోజు (నవంబర్ 20)నే ఈ సినిమాను విడుదల చేయబోతోన్నట్టు తెలిపాడు.

- Advertisement -

Related Posts

Gouri G Kishan Latest Photos

Gouri G Kishan Popular actress in tamil, Gouri G Kishan latest photos in shooting spot, Gouri G Kishan beautiful images, Gouri G Kishan, Gouri...

ప్ర‌భాస్ ఖాతాలో ఫాస్టెస్ట్ రికార్డ్‌.. అతి త‌క్కువ టైంలో ఆరు మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ సొంతం

రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు న‌ట వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్ర‌భాస్ ఛ‌త్ర‌ప‌తి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇందులో ప్ర‌భాస్ న‌ట‌న‌, ఆయ‌న నోటి నుండి వెలువ‌డిన డైలాగులు ప్రేక్ష‌కుల‌ని...

జాతీయ జెండాను ఆవిష్క‌రించిన చిరంజీవి.. జెండా పండుగ వేడుక‌లో పాల్గొన్న‌ మెగా ఫ్యామిలీ

72వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు దేశవ్యాప్తంగా ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ప్ర‌తి ఒక్క‌రు సంప్ర‌దాయ దుస్తులు ధరించి ఉద‌యాన్నే జాతీయ జెండా ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి త‌ను స్థాపించిన చిరంజీవి బ్ల‌డ్...

‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ .. సెట్స్ లో అడుగుపెట్టిన పవన్ !

టాలీవుడ్ అగ్రనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాణాదగ్గుబాటి ల కాంబినేషన్ లో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం:12 గా నిర్మిస్తున్న చిత్రం రెగ్యులర్...

Latest News