ఏయ్ జ‌గ‌న్‌గా బాడ్కావ్.. అంటూ ఆర్జీవీ తిట్లు

ఏయ్ జ‌గ‌న్‌గా బాడ్కావ్.. అంటూ ఆర్జీవీ తిట్లు

రామ్‌గోపాల్ వ‌ర్మ‌కు పిచ్చి ప‌ట్టిందా?. క‌ల్లు తాగిన కోతిలా మారి ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నాడు. శిష్యుడు హిట్టు కొడితే ఇంత ర‌చ్చ చేయాలా? అంటూ సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్స్ ఆర్జీవీకి కౌంట‌ర్లు ఇస్తున్నారు. గ‌త కొంత కాలంగా ఆర్జీవీ 15వ అసిస్టెంట్ పూరిజ‌గ‌న్నాథ్ కు చెప్పుకోద‌గ్గ హిట్టు లేదు. స‌క్సెస్ కోసం ముఖం వాచిపోయి వున్న పూరీ తాజాగా రామ్ పోతినేనితో తీసిన ఊర‌మాస్ సినిమా `ఇస్మార్ట్ శంక‌ర్‌`. ఈ సినిమా ఈ గురువారం విడుద‌లైంది. టాక్‌తో సంబంధం లేకుండా వ‌సూళ్లు కురిపిస్తోంది. ఈ సినిమా హిట్ కావ‌డం రామ్‌కు అవ‌స‌రం కానీ భారీ విజ‌యాన్ని సొంతం చేసుకోవ‌డం మాత్రం పూరీకి అనివార్యం.

ఇదే విష‌యాన్ని చాలా ఇంట‌ర్వ్యూల్లో పూరీ ఓపెన్‌గా చెప్పేశాడు. సినిమా విడుద‌లైన రోజు నుంచి డివైడ్ టాకే వున్నా, విమ‌ర్శ‌కులు పెద‌వి విరిచినా సినిమా మాత్రం క‌లెక్ష‌న్‌లు రాబ‌డుతోంది. దీంతో పూరీ, ఛార్మీ చిత్ర యూనిట్ సంబ‌రాల్లో మునిగితేలుతున్నారు. `టెంప‌ర్‌` త‌రువాత త‌న‌కు హిట్ రావ‌డంతో ఆ ఆనందాన్ని పూరీ అండ్ కో సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. ఇదిలా వుంటే పూరీ గురువు ఆర్జీవీ మాత్రం శనివారం ఉద‌యం నుంచి ఓవ‌ర్ చేస్తున్నాడు. థీయేట‌ర్ ద‌గ్గ‌ర హంగామా సృష్టించి ఆ త‌రువాత కేరింత‌లు కొడుతూ త‌ల‌పై మందు పోసుకుంటూ టీమ్‌తో హ‌గ్గుల దాకా వెళ్లిన ఆర్జీవీ అదీ చాల‌ద‌నుకున్నాడో ఏమో ట్విట్ట‌ర్ వేదిక‌గా పూరీపై బూతు పురాణం విప్పాడు.

అరేయ్ జ‌గ‌న్‌గా ఇట్టాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌లు తీసే ద‌మ్ముండి కూడా ఎందుకు తియ్య‌వ్‌ర్రా భాడ్కావ్` అంటూ ర‌చ్చ‌కు దిగ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఆర్జీవీ త‌న శిష్యుడు పూరీకి హిట్ వ‌చ్చింద‌ని మ‌రీ ఇంత‌లా అతి చేస్తూ ఎవ‌రికీ హిట్ రాలేదు, వీళ్ల‌కే కొత్త‌గా హిట్ వ‌చ్చిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని, ఒక్క హిట్ వ‌స్తే ఇంత అతిగా స్పందించాలా? అని సోష‌ల్ మీడియాలో ఆర్జీవీని ఓ రేంజ్‌లో నెటిజ‌న్స్‌ ఏసుకుంటున్నారు.