Vijay Sethupathi: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో హీరో విజయ్ సేతుపతి ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.. వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న పూరి జగన్నాథ్ నమ్మి సినిమా చేయడానికి ముందుకు వచ్చి ఒక అవకాశం ఇచ్చారు విజయ్ సేతుపతి. దీంతో ఈ సినిమాను చాలా పకడ్బందీగా ఎలా అయినా హిట్టు కొట్టాలని గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు పూరీ జగన్నాథ్. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.
ఇప్పటికే ఈ సినిమాలో టబు, రాధిక ఆప్టే వంటి హీరోయిన్లు నటించబోతున్నారు అంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరొక హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో నటించాల్సిన బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే తప్పకుండా ఆమె స్థానంలో టాలీవుడ్ హీరోయిన్ ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అటాలీవుడ్ హీరోయిన్ మరెవరో కాదు నటి నివేదా థామస్. ఈమె పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి నివేదా అలాగే మూవీ మేకర్స్ మధ్య చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
త్వరలోనే ఈ విషయంపై మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటన కూడా చేయనున్నారట. మరోవైపు ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ , చెన్నైలలో లొకేషన్లను వెతుకుతున్నారట. ఈ సినిమా షూటింగ్ జూన్ లో ప్రారంభమవుతుందని, విజయ్ సేతుపతి, దర్శకుడు పూరి జగన్నాధ్ కలిసి నటిస్తున్న మొదటి చిత్రం ఇది. ఈ సినిమా హిట్టవ్వడం పూరి జగన్నాథ్ కు చాలా అవసరం. ఈ సినిమా హిట్ అయితే పూరి జగన్నాథ్ కెరీర్ గాడిలో పడినట్టే. ఏమాత్రం తేడా కొట్టి బెడిసి కొట్టినా కూడా పూరి జగన్నాథ్ కెరీర్ అంధకారంలో పడిపోయినట్టే అని చెప్పాలి.