వర్మ రేటు పెంచాడు..ఈ సారి 10 లక్షలు

అప్పట్లో  ఆపేసి రీసెంట్ గా మళ్లీ మొదలెట్టిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను సీన్ లోకి వర్మ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం లో నటించటానికి గానీ ..నటీ నటుల ఎంపిక మొదలెట్టారు. అందుకోసం కొత్త దారి ఎంచుకున్నారు  వర్మ. సోషల్  మీడియా సాయంతో ఆడిషన్స్ పూర్తి చేయాలనుకున్నారు.

ఆ నిర్ణయం లో భాగంగా.. ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ అయిన చంద్రబాబు పోలికతో ఉన్న సర్వర్ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసి.. ఈ వ్యక్తి గురించి సమాచారం ఇచ్చిన వాళ్లకు లక్ష రూపాయలు ఇస్తా అంటూ ప్రకటన చేసి పట్టుకున్నారు వర్మ. ఈ ప్రకటనతో అటు పబ్లిసిటి..ఇటు నటుడు దొరికారు. ఈ ఆలోచన వర్కవుట్ కావటంతో వర్మ ఇప్పుడు మరో ఆఫర్ ప్రకటించాడు.

 


‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్ర కోసం ముగ్గుర్ని షార్ట్‌లిస్ట్‌ చేశానని, కానీ తనకు ఇంకా బెస్ట్ ఆర్టిస్ట్ కావాలని వర్మ అంటున్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో పోస్ట్‌ చేశారు.

 

‘ముగ్గురు నటుల్ని షార్ట్‌లిస్ట్‌ చేశా. కానీ నాకు ఇంకా ఉత్తమమైన వ్యక్తి కావాలి. లక్ష్మీపార్వతిని కలిసినప్పుడు ఎన్టీఆర్‌ ఏ వయసులో ఉన్నారో, అప్పుడు ఎలా కనిపించేవారో.. అలా ఉండే నటుడు కావాలి. ఆయనలా ఉండే, మాట్లాడే వ్యక్తి కనపడితే వీడియోను laksmisntr@gmail.comకు పంపండి. వారికి రూ.10 లక్షలు బహుమతి ఇస్తానని ఓపెన్‌గా ఆఫర్‌ చేస్తున్నా’ అని వర్మ తెలిపారు.

ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీ పార్వతి జీవితం ఆధారంగా ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ని వర్మ రూపొందించనున్నారు. అక్టోబరు 19న తిరుపతిలో ఈ సినిమా లాంచ్ అవుతుంది. రాకేశ్‌ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జీవీ ఫిల్మ్స్‌ పతాకంపై బాలగిరి సమర్పిస్తున్నారు.