రామ్‌చరణ్, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో ‘వినయ విధేయ రామ’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ఈ రోజు దీపావళి సందర్భంగా విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే ఊపుని కంటిన్యూ చేయటానికా అన్నట్లుగా టీజర్ ని వదిలారు. ఈ టీజర్ మాస్ కు కేరాఫ్ ఎడ్రస్ గా ఉంది .
నలభై తొమ్మిది సెకన్ల పాటు సాగే ఈ టీజర్‌ను మాస్ యాక్షన్ సీన్స్‌తో ప్యాక్డ్గా ఉంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ సినిమా 2019 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. భరత్ అనే నేను ఫేం కియారా అద్వానీ ఈ సినిమాలో చరణ్‌కు జోడిగా నటిస్తున్నారు.